Share News

Heat Waves: పెరుగుతున్న మరణాలు.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 19 , 2024 | 06:59 PM

ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వేడిగాలులు బలంగా వీస్తున్నాయి. ఆ క్రమంలో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతాధికారులకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.

Heat Waves: పెరుగుతున్న మరణాలు.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ, జూన్ 19: ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వేడిగాలులు బలంగా వీస్తున్నాయి. ఆ క్రమంలో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతాధికారులకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక హిట్‌వేవ్ విభాగాలను ఏర్పాటు చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.


మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో వాతావరణ పరిస్థితులు.. 51 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లుగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఈ వేడి గాలుల వల్ల మంగళవారం 11 మంది రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని ఆయన స్పష్టం చేశారు. ఈ వేడిగాలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 45 మంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని వివరించారు. ఈ వేడిగాలుల బారిన పడుతున్న వారిలో అత్యధికులు దినసరి కూలీలేనని ఆయన స్పష్టం చేశారు.


మరోవైపు ఈ వేడిగాలుల తీవ్రతతో ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆ క్రమంలో మరణిస్తున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ప్రభుత్వాసుపత్రుల్లో గత మూడు రోజుల్లో 40 మంది మరణించారు. వేడి గాలుల వల్లే ఈ మరణాలు సంభవించాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇక నోయిడాలో సైతం తొమ్మిది మంది ఈ వేడిగాలుల వల్ల మరణించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 06:59 PM