Share News

Viral Video: పాడైన హెలికాఫ్టర్.. గగనమార్గంలో తరలిస్తుండగా కూలిన వైనం!

ABN , Publish Date - Aug 31 , 2024 | 12:45 PM

పాడయిన ఓ ప్రైవేటు హెలికాఫ్టర్‌ను ఎయిర్ ఫోర్స్‌ ఎమ్ఐ - 17 హెలికాఫ్టర్‌తో గగనమార్గంలో తరలిస్తుండగా కూలిపోయింది. శనివారం హెలికాఫ్టర్‌ను కేదార్‌నాథ్ నుంచి గౌచర్‌కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.

Viral Video: పాడైన హెలికాఫ్టర్.. గగనమార్గంలో తరలిస్తుండగా కూలిన వైనం!

ఇంటర్నెట్ డెస్క్: పాడయిన ఓ ప్రైవేటు హెలికాఫ్టర్‌ను ఎయిర్ ఫోర్స్‌ ఎమ్ఐ - 17 హెలికాఫ్టర్‌తో గగనమార్గంలో తరలిస్తుండగా శనివారం కూలిపోయింది. హెలికాఫ్టర్‌ను రిపేర్ల కోసం కేదార్‌నాథ్ నుంచి గౌచర్‌కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. అధిక బరువు, గాలుల తీవ్రత కారణంగా ఎమ్ఐ-17 మార్గమధ్యంలో ఉండగానే అదుపు తప్పే పరిస్థితి వచ్చిపడింది. దీంతో, పైలట్ మందుజాగ్రత్తగా పాడయిన హెలికాఫ్టర్‌ను నిర్మానుష్య ప్రదేశంలో జారవిడిచారు. ఈ మేరకు రుద్రప్రయాగ్ జిల్లా టూరిజం అధికారి రాహుల్ చౌబే ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Jaipur: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే నో ప్రమోషన్.. హైకోర్టు ఏమందంటే


‘‘ఎమ్ఐ-17 హెలికాఫ్టర్ కొద్ది దూరం ప్రయాణించగానే అదుపు తప్పే పరిస్థితి వచ్చింది. పాడయిన హెలికాఫ్టర్‌ను అది మోయలేక పోయింది. ఆ సమయంలో గాలులు కూడా తీవ్రంగా ఉన్నాయి. దీంతో, పైలట్ హెలికాఫ్టర్‌ను జార విడిచారు’’ అని చౌబే తెలిపారు. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో మనుషులు, లగేజీ లేవన్నారు. విషయం తెలిసిన వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని అన్నారు. ఈ హెలికాఫ్టర్‌తో గతంలో ప్రయాణికులను కేదార్‌నాథ్ ఆలయానికి తీసుకెళ్లేవారని తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా మే నెలలో ఒకసారి ఇది కేదార్‌నాథ్ హెలిప్యాడ్‌ సమీపంలో అత్యవసరంగా దిగిపోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించారు (Helicopter Being Airlifted By MI 17 Chopper Crashes In Kedarnath).


ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ట్రెక్కింగ్ మార్గంలో ఆటంకాలు ఏర్పడటంతో కేదార్‌నాథ్‌కు భక్తుల రాక తగ్గిపోయింది. గౌరికుండ్ నుంచి కేదార్‌నాథ్ మార్గంలో వర్షాలకు కొండచరియలు విరిగి పడటంతో వేల మంది ప్రయాణికులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎక్కడివారు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. రోడ్డు మార్గం మూసుకుపోవడంతో భక్తులు హెలికాఫ్టర్ల ద్వారా కేదార్‌నాథ్‌కు చేరుకుంటున్నారు. మే నెల 10 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటివరకూ సుమారు 33 లక్షల మంది కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను సందర్శించారు.

For Latest News click here

Updated Date - Aug 31 , 2024 | 12:53 PM