Share News

ఢిల్లీ హైకోర్టు: డ్రైనేజీ పనులు చేస్తూ మరణిస్తే రూ.30లక్షలు

ABN , Publish Date - May 20 , 2024 | 04:29 AM

చేతులతో డ్రైనేజీ పనులు చేస్తూ పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

ఢిల్లీ హైకోర్టు: డ్రైనేజీ పనులు చేస్తూ మరణిస్తే రూ.30లక్షలు

న్యూఢిల్లీ, మే 19: చేతులతో డ్రైనేజీ పనులు చేస్తూ పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 2023లో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చిందని, దీన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. వారి కుటుంబానికి తగిన పునరావాసం కూడా కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఢిల్లీలోని లజపత్‌ నగర్‌లో డ్రైనేజీ పనులు చేస్తూ 2017లో మరణించిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల వంతున పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - May 20 , 2024 | 04:29 AM