Share News

Himachal Pradesh: సమోసాపై సీఐడీ!

ABN , Publish Date - Nov 09 , 2024 | 05:22 AM

హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో ‘సమోసా’ రచ్చరచ్చ చేస్తోంది. ఓ కార్యక్రమంలో సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు కోసం తెచ్చిన సమోసాలు మాయం కావడం, దానిపై సీఐడీ దర్యాప్తు చేస్తోందనే వార్తలు రావడమే ఆ రగడకు కారణం.

Himachal Pradesh: సమోసాపై సీఐడీ!

  • సీఎం కోసం తెచ్చిన సమోసాలు మాయం

  • అంతర్గత దర్యాప్తునకు ఆదేశించిన సీఐడీ

  • హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ రగడ

  • ఇవన్నీ బీజేపీ వదంతులేనన్న సీఎం సుఖు

సిమ్లా, నవంబరు 8: హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో ‘సమోసా’ రచ్చరచ్చ చేస్తోంది. ఓ కార్యక్రమంలో సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు కోసం తెచ్చిన సమోసాలు మాయం కావడం, దానిపై సీఐడీ దర్యాప్తు చేస్తోందనే వార్తలు రావడమే ఆ రగడకు కారణం. అసలు ఈ సమోసా దుమారం గత నెల 21న మొదలైంది. ఆరోజు సీఐడీ ప్రధాన కార్యాలయానికి సీఎం సుఖు వచ్చిన సందర్భంగా స్నాక్స్‌లా ఆయనకు వడ్డించడానికి సమోసాలు, కేకులు, ఇతర పదార్థాలు తీసుకువచ్చారు. అయితే ఆయనకు ఇవ్వడానికి ముందే సమోసాలు మాయం అయ్యాయి. తెచ్చిన సమోసాలు ఏమయ్యాయి అని సీఐడీ అధికారులు అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు.


సీఎం సెక్యూరిటీ సిబ్బందికి ఆ సమోసాలు వడ్డించారని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో సమోసాలపై సీఐడీ దర్యాప్తు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీన్ని అందిపుచ్చుకున్న విపక్ష బీజేపీ నేతలు.. ప్రభుత్వ చర్యలు కామెడీగా ఉన్నాయని, రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే సమోసాలు మాయం అవ్వడంపై దర్యాప్తునకు ఆదేశిస్తారా? అంటూ విమర్శలు చేశారు. సమోసాల మిస్సింగ్‌పై సీఐడీ విచారణకు ఆదేశించలేదని అని సీఎం సుఖు కూడా వివరణ ఇచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తు అంటూ మీడియానే వార్తలు ప్రచురిస్తోందన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 05:22 AM