Share News

Aadhaar New Rule: ఆధార్ కార్డు జారీ ఇక అంత ఈజీ కాదు

ABN , Publish Date - Sep 07 , 2024 | 08:55 PM

అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

Aadhaar New Rule: ఆధార్ కార్డు జారీ ఇక అంత ఈజీ కాదు

అసోం: ఆధార్ కార్డు (Addhaar) జారీపై అసోం (Assam) ప్రభుత్వం కొత్త రూల్ విధించింది. ఇక నుంచి రాష్ట్రంలో కొత్తగా ఆధార్ కార్డు కావాలనుకునే వారు తప్పనిసరిగా తమ జాతీయ పౌర నమోదు (NRC) నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) శనివారంనాడు ప్రకటించారు. జనాభా కంటే ఆధార్ కార్డు కోసం అప్లికేషన్లు ఎక్కువగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్టు అర్ధమవుతోందని చెప్పారు. అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఇక నుంచి అసోంలో ఆధార్ కార్డులు పొందడం అంత సులభం కాదన్నారు.

Puja Khedkar: పూజా కేడ్కర్‌కు కేంద్రం షాక్.. సర్వీసు నుంచి తొలగింపు


ఎన్ఆర్‌సీ సమయంలో బయోమెట్రిక్ లాక్ అయిన 9.55 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీ అప్లికేషన్ నెంబర్ జత చేయాల్సిన అవసరం లేదని, వాళ్లకు మాత్రం ఆధార్ కార్డులు జారీ అవుతాయని సీఎం చెప్పారు. అక్రమంగా అసోంలోకి చొరబడే వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశామని, గత రెండు నెలల్లో పలువురు బంగ్లాదేశీయులను పట్టుకుని ఆ దేశ అధికారులకు అప్పగించామని తెలిపారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2024 | 08:55 PM