Share News

ISRO: కాల్పనికం కాదు నిజమే.. రామ్‌సేతు ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

ABN , Publish Date - Jul 15 , 2024 | 07:07 AM

రామసేతుకు(Ram Setu) సంబంధించిన రహస్యాలను ఛేదించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో మైలురాయి చేరుకుంది. NASA ఉపగ్రహం సహాయంతో మొదటిసారిగా ఆడమ్ బ్రిడ్జ్ అని పిలిచే రామసేతు మ్యాప్‌ను ఆదివారం విడుదల చేసింది.

ISRO: కాల్పనికం కాదు నిజమే.. రామ్‌సేతు ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

ఢిల్లీ: రామసేతుకు(Ram Setu) సంబంధించిన రహస్యాలను ఛేదించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో మైలురాయి చేరుకుంది. NASA ఉపగ్రహం సహాయంతో మొదటిసారిగా ఆడమ్ బ్రిడ్జ్ అని పిలిచే రామసేతు మ్యాప్‌ను ఆదివారం విడుదల చేసింది.

ఇస్రో రూపొందించిన 10 మీటర్ల మ్యాప్‌లో వంతెన మొత్తం కనిపిస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఏస్‌శాట్‌-2(ACESAT-2) డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు.


రామ్‌సేతుకు సంబంధించి.. అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య 6 సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ల శాస్త్రవేత్తలు దీనిపై ఓ జర్నల్‌లో నివేదిక ప్రచురించారు. భారత్, శ్రీలంక మధ్య ఈ వంతెన పొడవు 29 కి.మీ.లు ఉంది. సముద్రగర్భం నుంచి దీని ఎత్తు 8 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ సేతు 99.98 శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 08:12 AM