Share News

PSLV C-59: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సి-59

ABN , Publish Date - Dec 05 , 2024 | 04:23 PM

సూర్యుడి కోసం అన్వేషణలో పీఎస్ ఎల్వీ సి-51 నింగిలోకి దూసుకెళ్లింది. కోట్లాది మంది భారతీయుల కలలను మోసుకుంటూ భానుడి వైపుగా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు...

PSLV C-59: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సి-59
PSLV C-59

శ్రీహరికోట: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ ఎల్వీ సి-59 ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోట నుంచి అనుకున్న సమయానికే గురువారం సాయంత్రం 4: 04 నిమిషాలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. నిన్న సాయంత్రం 4:08 గంటలకు ప్రయోగించాల్సిన పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.


ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. దీనిపై నిఘా పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూ కక్ష్యలో విహరిస్తుంటాయి. భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని సృష్టించడం వంటి ప్రయోగాలకు ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి. ఈ మిషన్ ద్వారా రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపించనున్నారు. వీటిని ఒకే కక్ష్యలో ఏర్పాటు చేశారు.


ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్ ను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇది భూమి నుంచి 60వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Ashok Khemka: ఇది కదా నిజాయితీ అంటే.. 33 ఏళ్లలో 57 పోస్టింగ్‌లు, విరమణ 5 నెలల ముందు మరోకటి


Updated Date - Dec 05 , 2024 | 04:29 PM