Jaipur Literature Festival: జైపూర్ సాహితీ ఉత్సవం షెడ్యూల్ వచ్చేసింది.. ప్రధాన వక్తలు ఎవరంటే
ABN , Publish Date - Nov 22 , 2024 | 09:17 PM
అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత జెన్నీ ఎర్పెన్‌బెక్, అమెరికన్ లిటరరీ హిస్టారియన్ స్టీఫెన్ గ్రీన్బ్లాట్, ఇటాలియన్ అమెరికన్ రచయిత ఆండ్రే అసిమన్, రాయబ్ బయోగ్రాఫర్ టినా బ్రౌన్ సహా 300 మంది వక్తలు ఈ ఉత్సవంలో పాల్గొంటారని జైపూర్ లిటరేషన్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్) నిర్వాహకులు ప్రకటించారు.
జైపూర్: ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జైపూర్ సాహిత్యోత్సానికి (Jaipur Literature Festival) సంబంధించిన 18వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని హోటల్ క్లార్క్స్ అమెర్ (Hotel Clarks Amer)లో ఈ కార్యక్రమం జరుగనుంది. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత జెన్నీ ఎర్పెన్‌బెక్, అమెరికన్ లిటరరీ హిస్టారియన్ స్టీఫెన్ గ్రీన్బ్లాట్, ఇటాలియన్ అమెరికన్ రచయిత ఆండ్రే అసిమన్, రాయబ్ బయోగ్రాఫర్ టినా బ్రౌన్ సహా 300 మంది వక్తలు ఈ ఉత్సవంలో పాల్గొంటారని జైపూర్ లిటరేషన్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్) నిర్వాహకులు ప్రకటించారు.
Rahul Gandhi: ముంచుకొస్తున్న ముప్పు.. కలిసికట్టుగా పరిష్కారం కనుగొనాలి
'భూమిపై ఉన్న గొప్ప సాహిత్య ప్రదర్శనగా' జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌ను అభివర్ణిస్తుంటారు. ఐదు రోజుల పాటు జరిగే సాహిత్యోత్సవంలో భిన్న భాషలు, సంస్కృతికి సంబంధించిన సాహిత్యంపై సెషన్స్ నిర్వహిస్తారు. అస్సామీ, హిందీ, కన్నడ, కశ్మీర్, మలయాళం, మరాఠీ, ఒడియా, సంస్కృతం, పంజాబీ, తమిళం, ఉర్దూ వంటి పలు భాషల సాహిత్యంలో సెషన్స్ ఉంటాయి.
''అనేక రకాల సాహిత్య ఇతివృత్తాలు, ఆలోచనలను అన్వేషించడానికి, రచయితలు, మేథావులు, వ్యక్తల విభన్న ప్రపంచ సమాజాన్ని ఏకం చేయడానికి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఈసారి కూడా వేదికగా నిలువనుంది. రచయితలు, కవులు, మేథావులను తమ ఆలోచనలను అందిరితో పంచుకునేందుకు ఆహ్వానించాం'' అని రచయిత, జేఎల్ఎఫ్ కో-డైరెక్టర్ నమిత గోఖలే తెలిపారు.
కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తల తొలి జాబితాను కూడా జేఎల్ఎఫ్ విడుదల చేసింది. వీరిలో సాహిత్యంలో నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణ, చరిత్రకారుడు అనురుథ్ కనిసెట్టి, ఆస్ట్రేలియా రచయిత అన్న ఫుండెర్, రచయిత కావేరీ మాధవన్, భౌతిక శాస్త్రవేత్త క్లాడియ డి రామ్, బ్రిటిష్ నావలిస్ట్ డావిడ్ నికొల్లస్, రచయితి ఐ.ముఖోతి, రంగస్థల నటుడు మానవ్ కౌల్, కెనడా రచయిత జాన్ వైలాంట్, నైజీరియా నావలిస్ట్ ఐరెనోసేన్ ఒకోజి, పాత్రికేయుడు-రచయిత కల్లోల్ భట్టాచార్జి, హ్యారీపోటర్ నటి మిరియం మార్గోలిస్, అమెరికా రచయిత నాథన్ థ్రాల్, నావలిస్ట్ ప్రయాగ్ అక్బర్, రచయిత-ఫిల్మ్ మేకర్ ప్రియాంక మట్టూ, ఉక్రెయిన్ రచయిత యారోస్లవ్ ట్రోఫిమోవ్ ఉన్నారు. ఫెస్టివల్‌కు సమాంతరంగా జైపూర్ బుక్ మార్క్ (జేబీఎం) 11వ ఎడిషన్ కూడా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ పబ్లిషర్లు, లిటరలీ ఏజెంట్లు, రచయితలు, ట్రాన్సలేటర్లు, ట్రాన్సలేషన్ ఏజెన్సీలు, బుక్ సెల్లర్స్ పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి...
Supreme Court: ఢిల్లీ ప్రవేశమార్గాలపై సుప్రీం కీలక ఆదేశాలు
Maharashtra CM: ఎన్నికల ఫలితాలకు ముందే.. పవార్ సీఎం అంటూ పోస్టర్లు, ఊరేగింపులు
Rain Alert: 9 రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో పొగమంచు కూడా..
Read More National News and Latest Telugu News