CM Hemant Soren: విశ్వాస పరీక్ష, క్యాబినెట్ విస్తరణకు సోరెన్ రెడీ..ఎప్పుడంటే..?
ABN , Publish Date - Jul 07 , 2024 | 08:27 PM
జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఈనెల 8వ తేదీ సోమవారంనాడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే మంత్రివర్గాన్ని కూడా సోరెన్ విస్తరించనున్నారు.
రాంచీ: జార్ఖాండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఈనెల 8వ తేదీ సోమవారంనాడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే మంత్రివర్గాన్ని కూడా సోరెన్ విస్తరించనున్నారు. ఇటీవల వేగంగా చేటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా హేమంత్ సోరెన్ జార్ఖాండ్ 13వ ముఖ్యమంత్రిగా జూలై 4న ప్రమాణస్వీకారం చేశారు.
Mahua Moitra: మహువా మొయిత్రాపై కొత్త క్రిమినల్ చట్టం కింద ఎఫ్ఐఆర్
భూ కుంభకోణానికి సంబధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. దీంతో జేఎంఎం నేత చంపాయి సోరెన్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. హేమంత్ సోరెన్ ఐదు నెలల అనంతరం జార్ఖాండ్ హైకోర్టు ఆదేశాలతో జూన్ 28న బెయిలుపై విడుదలయ్యారు. ఆ వెంటనే చంపాయి సోరెన్ నివాసంలో జేఎంఎం శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, చంపాయి సోరెన్ రాజీనామా చేయడంతో తిరిగి మూడోసారి సీఎంగా హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టారు. కాగా, 81 మంది సభ్యుల అసెంబ్లీలో జేఎంఎంకు 27 సీట్లు, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి జేఎంఎం సర్కార్ సునాయాసంగా విశ్వాస పరీక్షలో నెగ్గే అవకాశాలు ఉన్నాయి.
Read Latest Telangana News and National News