Share News

Kathmandu: విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్‌ ప్రధాని ప్రచండ

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:55 AM

నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ ఆ దేశ పార్లమెంటులో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్ష ఓడారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి.....

Kathmandu: విశ్వాస పరీక్షలో ఓడిన నేపాల్‌ ప్రధాని ప్రచండ

కాట్మాండు, జూలై 12: నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ ఆ దేశ పార్లమెంటులో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్ష ఓడారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన సీపీఎన్‌-యూఎంఎల్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

275 మంది సభ్యులున్న నేపాల్‌ దిగువ సభలో ప్రచండకు కేవలం 63 ఓట్లే వచ్చాయి. వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 138 ఓట్లు అవసరం. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌-మావోయిస్టు సెంటర్‌(సీపీఎన్‌-ఎంసీ) చైర్మన్‌ అయిన ప్రచండ 2022 డిసెంబరు 25న అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు విశ్వాస పరీక్షలో గట్టెక్కారు.

Updated Date - Jul 13 , 2024 | 03:55 AM