Share News

London : బ్రిటన్‌ పార్లమెంటులో భగవద్గీత

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:08 AM

బ్రిటన్‌ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఎన్నికైన పలువురు భారతీయ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ ప్రత్యేకత చాటుకున్నారు.

London : బ్రిటన్‌ పార్లమెంటులో భగవద్గీత

  • పవిత్ర గ్రంథం సాక్షిగా పలువురు ఎంపీల ప్రమాణం

  • వీరిలో మాజీ ప్రధాని సునాక్‌, శివానీ రాజా, కనిష్క్‌..!

లండన్‌, జూలై 11: బ్రిటన్‌ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఎన్నికైన పలువురు భారతీయ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 29 మంది భారత సంతతి వారు యూకేలో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వీరిలో జన్మతః హిందువులైన మాజీ ప్రధాని రిషి సునాక్‌తో పాటు శివానీ రాజా, కనిష్క నారాయణ్‌లు భగవద్గీతపై ప్రమాణం చేశారు. శివానీ..

గుజరాత్‌ నుంచి వెళ్లి బ్రిటన్‌లో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గత వారం ఎన్నికల్లో ఈమె కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి గెలిచారు. యూకేలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. కనిష్క.. అధికార లేబర్‌ పార్టీ తరఫున తొలిసారిగా వేల్‌ ఆఫ్‌ గ్లామెర్గాన్‌ నుంచి నెగ్గారు. వేల్స్‌ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారత సంతతి ఎంపీ ఈయన.

సిక్కు ఎంపీలు తాన్‌ దేశీ, గురీంద్‌ సింగ్‌ జోసన్‌, హర్‌ప్రీత్‌ ఉప్పల్‌, సత్వీర్‌ కౌర్‌, వారిందర్‌ సింగ్‌ జస్‌లు తమ పవిత్ర గ్రంథం గురు గ్రంథ్‌ సాహిబ్‌ సాక్షిగా ప్రమాణం చేశారు. అయితే, వీరు ఆ గ్రంథం చేతబట్టుకోలేదు. ఇక మాజీ మంత్రి ప్రీతి పటేల్‌తో పాటు క్లైరీ కౌటిన్హో, మునిరా విల్సన్‌, కేరళకు చెందిన సోజన్‌ జోసెఫ్‌ (యాష్‌ఫొర్డ్‌ కెంట్‌) తమ ప్రమాణం సందర్భంగా బైబిల్‌ను ఎంచుకున్నారు.

Updated Date - Jul 12 , 2024 | 04:09 AM