Share News

Lok Sabha Video: జేబులో చేయి తీసి మాట్లాడండి.. కేంద్ర మంత్రికి స్పీకర్ మందలింపు

ABN , Publish Date - Jul 27 , 2024 | 07:59 AM

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సభలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Lok Sabha Video: జేబులో చేయి తీసి మాట్లాడండి.. కేంద్ర మంత్రికి స్పీకర్ మందలింపు

ఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సభలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) వారిని వారిస్తూ.. సభలో వాగ్వాదానికి దిగడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం ఓ కేంద్ర మంత్రి మాట్లాడుతూ జేబులో చేయి పెట్టుకున్నారు. దీన్ని గమనించిన స్పీకర్.. జేబులో నుంచి చేయి తీసి మాట్లాడాలని మందలించారు.


"మంత్రి జీ హాత్ జెబ్ సే బహార్" అని చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి చేతులు బయటకి తీశారు. సభలో ఎవరూ ఇలా చేయవద్దని ఓం బిర్లా వారిని కోరారు. బిర్లా.. ఏ మంత్రిని ఉద్దేశించి అన్నారో వీడియోలో స్పష్టంగా కనిపించలేదు. సభలో ఎవరైనా సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు వారి ముందుకు సభ్యులు వెళ్లరాదని అలా వెళ్లడం సభా మర్యాదకు భంగం కలిగించడమేనని స్పష్టం చేశారు.

జూన్ 24న ఓం బిర్లా, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మధ్య వాగ్వాదం నెట్టింట వైరల్ గా మారింది. బడ్జెట్‌పై మాట్లాడేటప్పుడు గతంలో జరిగిన అంశాల గురించి మాట్లాడవద్దని, ప్రస్తుత బడ్జెట్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని ఓం బిర్లా .. అభిషేక్ బెనర్జీని కోరారు. అలాంటప్పుడు చాలా మంది మాజీ ప్రధాని నెహ్రూ గురించి మాట్లాడుతున్నారని.. ఆ అంశం గతానికి సంబంధించింది కాదా అని అభిషేక్ ప్రశ్నించారు.


మోదీ 3.0లో ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌ను జులై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. బడ్జెట్ గొప్పగా ఉందని ఎన్డీయే పక్షాలు సమర్థిస్తుండగా, ఇద్దరు మిత్రపక్షాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా కాంగ్రెస్‌ సహా, ఇండియా కూటమి నేతలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు జులై 22న ప్రారంభం కాగా ఆగస్టు 12న ముగుస్తాయి.


ప్రైవేటు బిల్లులు..

లోక్‌సభలో 10 శాతం సీట్లను 35 ఏళ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కోరే ప్రైవేటు బిల్లును కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లును కూడా శశిథరూర్ సభలోకి తెచ్చారు. ఇవే కాకుండా మరో 30కిపైగా ప్రైవేటు బిల్లులను పలువురు సభ్యులు సభలో ప్రవేశపెట్టారు.

Updated Date - Jul 27 , 2024 | 07:59 AM