Share News

Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ

ABN , Publish Date - Sep 01 , 2024 | 09:53 AM

యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్‌ను దుండగులు అటకాయించి దోచుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 15 వందలకుపైగా ఐఫోన్లు చోరీ అయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి సంజయ్ ఉకే వెల్లడించారు.

Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ

భోపాల్, సెప్టెంబర్ 01: యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్‌ను దుండగులు అటకాయించి దోచుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 15 వందలకుపైగా ఐఫోన్లు చోరీ అయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి సంజయ్ ఉకే వెల్లడించారు. వాటి విలువ రూ.11 కోట్లు ఉంటుందని తెలిపారు.

Also Read: Haryana Assembly Elections: బీజేపీపై గెలుపునకు కాంగ్రెస్ వినూత్న ప్రచారం


హరియాణాలోని గుర్‌గావ్ నుంచి చెన్నైకి ఫోన్లు లోడ్‌తో ఈ ట్రక్ వెళ్తుండగా ఈ చోరీ జరిగిందని చెప్పారు. ఈ చోరీ జరిగిన సమయంలో ట్రక్ డ్రైవర్‌కు మత్తుమందు ఇచ్చి.. దుండగులు ఈ దోపిడికి పాల్పడ్డారన్నారు. ఈ చోరీ ఘటనపై ఇప్పటి వరకు యాపిల్ ఫోన్ సంస్థ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ దోపిడి జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ ట్రక్ ప్రయాణించిన ప్రాంతంలోని వీడియో ట్రాక్‌ను సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

Also Read: Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..


ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణ ఇప్పటికే పూర్తి అయిందన్నారు. ఈ చోరీ ఘటనపై బండారీ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు ట్రక్ డ్రైవర్ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ సమయంలో ఎస్ఐ భగత్‌చంద్ ఉకే, ఏఎస్ఐ రాజేంద్ర పాండేతోపాటు కానిస్టేబుల్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆ క్రమంలో వీరిపై చర్యలకు ఉప్రకమించినట్లు తెలిపారు. ఈ కేసుపై సాగర్ జోన్ ఐజీ ప్రమోద్ వర్మ ప్రత్యేక దృష్టి సారించారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 02 , 2024 | 12:54 PM