Share News

Mamata Banerjee: ఆదివారం వరకే గడువు.. ఏంటంటే..?

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:19 PM

ట్రైనీ డాక్టర్ మృతి అంశం పశ్చిమ బెంగాల్‌‌లో ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు చేరింది. దీంతో బెంగాల్ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. డాక్టర్ మృతి కేసును ఆదివారం లోపు ముగించాలని గడువు విధించారు. లేదంటే సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు.

Mamata Banerjee: ఆదివారం వరకే గడువు.. ఏంటంటే..?
West Bengal CM Mamata Banerjee

కోల్ కతా: ట్రైనీ డాక్టర్ మృతి అంశం పశ్చిమ బెంగాల్‌‌లో (West Bengal) ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు చేరింది. దీంతో బెంగాల్ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. డాక్టర్ మృతి కేసును ఆదివారం లోపు ముగించాలని గడువు విధించారు. లేదంటే సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు.


didi-2.jpg


చాలా బాధేసింది..

‘బెంగాల్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ మృతి అంశం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ ఘటన గురించి తెలిసి చాలా బాధపడ్డా. ఘటన జరిగిన ప్రాంతంలో డాగ్ స్వ్కాడ్‌ పరిశీలిస్తోంది. ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది. డాక్టర్ మృతి వెనక ఎవరున్నా సరే శిక్షిస్తాం. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం. దాంతో బాధితురాలికి త్వరగా న్యాయం జరుగుతుంది. ఆస్పత్రిలో నర్సులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ లైంగిక దాడి జరగడం దారుణం. ఆస్పత్రిలో ఉన్న కొందరి ప్రమేయం ఉందని బాధితురాలి పేరంట్స్ చెబుతున్నారు. దాంతో వెంటనే చర్యలు తీసుకున్నాం. విభాగ అధిపతి, మెడికల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తప్పించాం అని’ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.


didi-1.jpg


ఇది విషయం..

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో శుక్రవారం ఉదయం ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించింది. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయి. పోస్టుమార్టం చేయగా.. లైంగికదాడి చేసిన తర్వాత హత్య చేశారని తేలింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ కనిపించాడు. ఘటనా స్థలంలో అతని హెడ్ సెట్ కూడా లభించింది. దాంతో ట్రైనీ డాక్టర్‌పై సంజయ్ లైంగికదాడి చేశాడని తేలింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రితో సివిక్ వాలంటీర్‌కు సంబంధం ఉండదు. కానీ అతను తరచుగా అక్కడికి వచ్చేవాడని.. గురువారం లైంగిక దాడి చేసి, హతమార్చాడని స్పష్టమైంది. పోలీసుల విచారణలో సంజయ్ నేరం అంగీకరించారని తెలుస్తోంది.


కఠినంగా శిక్షించాలి..

నిందితుడు సంజయ్ రాయ్‌ను కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. వైద్య విద్యార్థుల ఆందోళనతో సీఎం మమతా బెనర్జీ దిగొచ్చారు. కేసును వీలైనంత త్వరగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఆదివారం లోపు సాక్ష్యాధారాలతో కేసు ఫైల్ చేయాలని.. లేదంటే కేసును సీబీఐకి బదిలీ చేస్తానని స్పష్టం చేశారు.


Read More
National News
and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 03:19 PM