Share News

మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల

ABN , Publish Date - Nov 17 , 2024 | 03:48 AM

మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల చెలరేగింది. నిరసన ప్రదర్శనలతో ఇంఫాల్‌ లోయ దద్దరిల్లింది.

మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల

  • పశ్చిమ ఇంఫాల్‌లో కర్ఫ్యూ.. 7 జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌

ఇంఫాల్‌, నవంబరు 16: మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల చెలరేగింది. నిరసన ప్రదర్శనలతో ఇంఫాల్‌ లోయ దద్దరిల్లింది. ఆందోళనకారులు రాజకీయ నాయకుల ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. ఇందులో మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ అల్లుడు రాజ్‌కుమార్‌ సింగ్‌ నివాసం కూడా ఉంది. సీఎం ఇంటిపైనా దాడికి యత్నించారు. నిరసనలు తీవ్రం కావడంతో పశ్చిమ ఇంఫాల్‌లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్‌ లోయ సహా ఏడు జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. శుక్రవారం ముగ్గురు మైతేయీల(ఇద్దరు పిల్లలు, ఒక మహిళ) మృతదేహాలు జిరి నదిలో తేలి కనిపించడం తాజా నిరసన జ్వాలలకు కారణమైంది. కాగా. శనివారం హింసాత్మక నిరసనలపై కేంద్రం కూడా స్పందించింది. శాంతిభద్రతల పునరుద్ధరణకు భద్రతా బలగాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Updated Date - Nov 17 , 2024 | 03:49 AM