Jairam Ramesh: కార్పొరేట్స్ కంటే మిడిల్ క్లాస్‌పైనే అధిక పన్నుల భారం: జైరామ్ రమేష్
ABN , Publish Date - Jul 14 , 2024 | 07:36 PM
కార్పొరేట్ కంపెనీల టే మధ్యతరగతి ప్రజానీకమే అధికంగా పన్నులు చెల్లిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మిడిల్ క్లాస్ ప్రజలు భారీ పన్నుల భారం మోస్తుంటే, కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా రూ.2 లక్షల కోట్ల మేరకు బిలియనీర్ల జేబులు నింపారని అన్నారు.
న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీల (Corporate companies) కంటే మధ్యతరగతి (Middile class) ప్రజానీకమే అధికంగా పన్నులు(Tax) చెల్లిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మిడిల్ క్లాస్ ప్రజలు భారీ పన్నుల భారం మోస్తుంటే, కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా రూ.2 లక్షల కోట్ల మేరకు బిలియనీర్ల జేబులు నింపారని అన్నారు.
Mallikarjun Kharge: 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలెక్కడిచ్చారు.. మోదీకి ఖర్గే సూటి ప్రశ్న
''జూలై 23న కేంద్ర బడ్జెట్ రాబోతోంది. దానికి ముందే పన్ను వసూళ్ల గణాంకాలు వెల్లడయ్యాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి జూలై 1 వరకూ ఆదాయం పన్ను వసూళ్లు 3.61 లక్షల కోట్లు కాగా, స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.2.65 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీలు కంటే వ్యక్తులు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నారని తాము చాలాకాలంగా చెబుతూ వస్తున్నదే నిజమని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి'' అని జైరామ్ రమేష్ తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో మొత్తం పన్ను వసూళ్లలో వ్యక్తిగత ఆదాయం పన్ను 21 శాతం ఉండగా, ఇప్పుడది 28 శాతానికి పెరిగిందని వివరించారు. ఇదే సమయంలో కంపెనీలు చెల్లించే కార్పొరేట్ పన్ను వాటా 35 శాతం నుంచి 26 శాతానికి పడిపోయిందని చెప్పారు. 2019లోనూ కార్పొరేట్ పన్నును కేంద్రం తగ్గించిందని, కానీ ఆశించిన మేరకు ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి బదులు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ హయాంలో 35 శాతంగా ఉన్న జీడీపీ 2014-24 మధ్య 29 శాతం కంటే తగ్గిపోయిందన్నారు.
For Latest News and National News click here