Share News

Mumbai : అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం

ABN , Publish Date - Jul 13 , 2024 | 02:44 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లిసందడి అత్యంత వైభవంగా జరుగుతోంది. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ,

Mumbai : అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం

ముంబై, జూలై 12 : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లిసందడి అత్యంత వైభవంగా జరుగుతోంది. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఫార్మారంగ దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక మర్చంట్‌ హిందూ సంప్రదాయ పద్ధతిలో శుక్రవారం దంపతులు అయ్యారు. ముంబైలోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.

యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, శాంసంగ్‌ చైర్మన్‌ జేలీ తోపాటు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, దక్షిణాది సినీ తారలు రజనీకాంత్‌, రామ్‌చరణ్‌, మహేశ్‌బాబు తదితరులు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోనీ, హార్ధిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా తదితర క్రికెటర్లు, హాలీవుడ్‌ నటుడు, డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ జాన్‌ సీనా, రియాల్టీ టీవీ స్టార్‌ కిమ్‌ కార్డిషన్‌ వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకలో సందడి చేశారు.

Updated Date - Jul 13 , 2024 | 02:44 AM