Share News

Delhi : చైనా కంపెనీల వీసా అక్రమాలు

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:58 AM

భారత్‌లోకి చైనా ఉత్పత్తుల దిగుమతుల్లో అనేక అవకతవకలను జాతీయ భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. వీసాల కోసం చైనా కంపెనీలు సరైన డాక్యుమెంటేషన్‌ చేయకపోవడం, స్థానిక పన్నుల ఎగవేత...

Delhi : చైనా కంపెనీల వీసా అక్రమాలు

2020కి ముందు ఈ-వీసా

పథకం దుర్వినియోగం

గుర్తించిన ఇంటెలిజెన్స్‌, ఆర్థిక దర్యాప్తు సంస్థలు

న్యూఢిల్లీ, జూన్‌ 22: భారత్‌లోకి చైనా ఉత్పత్తుల దిగుమతుల్లో అనేక అవకతవకలను జాతీయ భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. వీసాల కోసం చైనా కంపెనీలు సరైన డాక్యుమెంటేషన్‌ చేయకపోవడం, స్థానిక పన్నుల ఎగవేత, హోంశాఖ పరిశీలను దాటవేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2020కి ముందు ఈ-వీసా పథకాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేసినట్లు భారత ఇంటెలిజెన్స్‌, ఆర్థిక దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీసా రెన్యువల్‌ చేయించకుండానే కొందరు చైనీయులు భారత్‌లో ఎక్కువ కాలం నివాసం ఉండటమే కాకుండా అరుణాచల్‌ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌ వంటి సరిహద్దు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సైతం ప్రయాణించారని ఆ వర్గాలు తెలిపాయి.

వీసా కేటగిరీలను తప్పుగా ప్రకటించడం ద్వారా ప్రస్తుత వీసా విధానాన్ని కూడా కొన్ని చైనా కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మూడు మంత్రిత్వ శాఖల అధికారులు పేర్కొన్నారు. పారిశ్రామిక యూనిట్ల స్థాపన, ప్రారంభం కోసం ఎంప్లాయిమెంట్‌ వీసాకు దరఖాస్తు చేయాల్సి ఉండగా, కొన్ని చైనా సంస్థలు బిజినెస్‌ వీసాల కోసం దరఖాస్తు చేస్తున్నాయని వివరించారు. 2018లో చైనా కంపెనీలకు 48వేల బిజినెస్‌ వీసాలు జారీ కాగా, అదే సమయంలో ఈ-వీసాల సంఖ్య 1,50,000గా నమోదైంది.

ఇక 2019లో చైనీయులకు జారీ చేసిన బిజినెస్‌ వీసాలు 19వేలు అయితే ఆదే ఏడాది ఈ-వీసాల సంఖ్య 2లక్షలకు పెరిగింది. 2020లో గల్వాన్‌ ఘర్షణల తర్వాత వీసాల జారీపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 2023-24లో 2,500 వ్యాపార వీసాలు, మరో 3వేల ఈ-వీసాలు మాత్రమే చైనా కంపెనీలు, కార్మికులకు మంజూరయ్యాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకూ వీటి సంఖ్య పెరిగే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశార

Updated Date - Jun 23 , 2024 | 06:51 AM