Share News

Naveen Patnaik greets Chandrababu: మీ అభివృద్ధి విజన్ సాకారం కావాలి.. చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ అభినందనలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:44 PM

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ఒడిశా అవుట్ గోయింగ్ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ బుధవారంనాడు అభినందనలు తెలిపారు.

Naveen Patnaik greets Chandrababu: మీ అభివృద్ధి విజన్ సాకారం కావాలి.. చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ అభినందనలు

భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)కు ఒడిశా అవుట్ గోయింగ్ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) బుధవారంనాడు అభినందనలు తెలిపారు. చంద్రబాబు విజనరీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, అభ్యుదయం దిశగా సమున్నత శిఖరాలకు చేరుతుందని తాను కచ్చితంగా చెప్పగలనని, మీకు సర్వదా విజయాలు చేకూరాలని ఆశిస్తున్నానని పట్నాయక్ తన అభినందన సందేశంలో తెలిపారు.

Odisha: సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు


నా ప్రమాణ స్వీకారానికి రండి..

కాగా, ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న మోహన్ చరణ్ మాఝీ బుధవారం ఉదయం నేరుగా నవీన్ పట్నాయక్‌ను కలుసుకున్నారు. తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు గాను 78 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో నవీన్ పట్నాయక్ చిరకాల పాలనకు తెరపడి, తొలిసారి ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతోంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 02:47 PM