Share News

NEET UG 2024: నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు.. ఆగస్టు 14 నుంచే

ABN , Publish Date - Jul 29 , 2024 | 10:11 PM

నీట్ యూజీ కౌన్సిలింగ్‌పై(NEET UG 2024) కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్టు14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

NEET UG  2024: నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు.. ఆగస్టు 14 నుంచే

ఢిల్లీ: నీట్ యూజీ కౌన్సిలింగ్‌పై(NEET UG 2024) కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్టు14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కౌన్సెలింగ్ కి సంబంధించిన షెడ్యూల్, అప్‌డేట్ తదితర వివరాల కోసం.. మెడికల్ కౌన్సిల్ వెబ్‌సైట్‌ ఎప్పటికప్పుడు చూడాలని విద్యార్థులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు నీట్ అభ్యర్థులకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ నోటీస్ రిలీజ్ చేసింది. ఆగస్టు మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అర్హులెవరు..

NEET UG 2024 పరీక్షలో 50 శాతం మార్కులు పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి అర్హులు. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఉత్తీర్ణత శాతంలో సడలింపు పొందుతారు.

దివ్యాంగులు 40 శాతం, రిజర్వ్ చేయని దివ్యాంగులు అర్హత సాధించడానికి 45 శాతం అవసరం. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) 15 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్శిటీలు, ESIC, AFMC, BHU, AMU సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.

Updated Date - Jul 29 , 2024 | 10:11 PM