Share News

NITI Aayog meet: జైరామ్, మీరక్కడ లేరు... మమత వాకౌట్‌పై నిర్మల సీతారామన్

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:25 PM

'నీతి ఆయోగ్‌' సమావేశం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తప్పుపట్టడంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ''సమావేశంలో మీరు లేనే లేరు...ఎలా తప్పుపడతారు?'' అని జైరామ్ రమేష్‌ను ప్రశ్నించారు.

NITI Aayog meet: జైరామ్, మీరక్కడ లేరు... మమత వాకౌట్‌పై నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ: 'నీతి ఆయోగ్‌' సమావేశం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వాకౌట్ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) తప్పుపట్టడంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్పందించారు. ''సమావేశంలో మీరు లేనే లేరు...ఎలా తప్పుపడతారు?'' అని జైరామ్ రమేష్‌ను ప్రశ్నించారు.


''జయరామ్... మీరు నీతి ఆయోగ్ సమావేశంలో లేనేలేరు. సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడినదంతా మేము విన్నాం. ప్రసంగానికి కేటాయించిన పూర్తి సమయాన్ని మమత ఉపయోగించుకున్నారు. కొందరు ముఖ్యమంత్రులు స్వయంగా రిక్వెస్ట్ చేసుకుని తమకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు మాట్లాడారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా వారికి అదనపు సమయం కేటాయించారు. సీఎం మమతా బెనర్జీతో సహా ఏ ఒక్కరి మైకులు స్విచ్ఛాఫ్ చేయలేదు. కేవలం అబద్ధాల ప్రచారానికి మమత దిగారు'' అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

NITI Aayog meeting: మమత మైక్ కట్ చేయడంలో నిజం ఎంత? ఎవరేం చెప్పారు?


మమత హాజరుకావడం హ్యాపీనే..

నీతి ఆయోగ్ సమావేశానికి బెంగాల్ సీఎంగా మమతాబెనర్జీ హాజరుకావడం సంతోషం కలిగించిందని నిర్మలా సీతారామన్ అన్నారు. విపక్షం తరఫున తాను ఒక్కరినే హాజరయ్యానని ఆమె మాట్లాడిన దానితో తాను ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఆమె సమావేశం వెలుపల మాట్లాడిన మాటలు మాత్రం పూర్తిగా నిరాధారమని చెప్పారు. 'ఇండియా' కూటమిని సంతోషపెట్టడానికే ఆ పని ఆమె చేసి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.


మమత ఏమన్నారు?

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన మమతా బెనర్జీ సమావేశం మధ్యలో ఉండగానే వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి తాను ఒక్కరినే హాజరయ్యాయని, కేంద్రం వివక్షా పూరితంగా వ్యవహరించిందని చెప్పారు. పలువురు సీఎంలు ఎక్కువ సేపు మాట్లాడారని, తాను మాట్లాడుతుండగా మాత్రం 5 నిమిషాలకే మైక్ కట్ చేశారని ఆరోపించారు. కాగా, ఆమె మాటలు సత్యదూరమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఆ తర్వాత నిర్ధారించింది.

Read more National News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 09:25 PM