Share News

నోయిడా విమానాశ్రయంలో.. విమాన ల్యాండింగ్‌ పరీక్షలు విజయవంతం

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:32 AM

ఢిల్లీ(ఎన్‌సీఆర్‌)లో నిర్మితమవుతున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఐఏ)లో సోమవారం తొలిసారిగా విమాన ల్యాండింగ్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు.

నోయిడా విమానాశ్రయంలో.. విమాన ల్యాండింగ్‌ పరీక్షలు విజయవంతం

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఢిల్లీ(ఎన్‌సీఆర్‌)లో నిర్మితమవుతున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఐఏ)లో సోమవారం తొలిసారిగా విమాన ల్యాండింగ్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి సిబ్బందితో బయలుదేరిన ఇండిగో ఏ- 320 విమానం చోదన వ్యవస్థ పనితీరు, ఎయిర్‌ ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థల పరీక్షల అనంతరం సురక్షితంగా నోయిడా విమానాశ్రయ రన్‌వే పై ల్యాండ్‌ అయింది. ఈ సందర్భంగా విమానాశ్రయ సిబ్బంది విమానానికి వాటర్‌ సెల్యూట్‌ సమర్పించారు. దేశ రాజధానిలో ఇప్పటికే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ అక్కడ పెరుగుతున్న రద్దీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి సమీపంలోని జేవర్‌లో అధునాతన హంగులు, సదుపాయాలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Dec 10 , 2024 | 03:33 AM