Share News

WHO: 77 శాతం చిన్నారులకు పౌష్టికాహారం దూరమే

ABN , Publish Date - Oct 23 , 2024 | 03:13 PM

డబ్ల్యూహెచ్‌ఓ(WHO) సూచించినట్లుగా 6-23 నెలల వయస్సు గల 77 శాతం మంది పిల్లలకు(భారత్) పౌష్టికాహారం అందట్లేదని ఓ అధ్యయనం పేర్కొంది. దేశంలోని మధ్య ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పింది.

WHO: 77 శాతం చిన్నారులకు పౌష్టికాహారం దూరమే

న్యూఢిల్లీ: డబ్ల్యూహెచ్‌ఓ(WHO) సూచించినట్లుగా 6-23 నెలల వయస్సు గల 77 శాతం మంది పిల్లలకు(భారత్) పౌష్టికాహారం అందట్లేదని ఓ అధ్యయనం పేర్కొంది. దేశంలోని మధ్య ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది మరీ అధికంగా ఉందని చెప్పింది. పిల్లలకు అందించే ఆహార నాణ్యతను అంచనా వేయడానికి కనీస ఆహార వైవిధ్యం (MDD) స్కోర్‌ను ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. తల్లిపాలు, గుడ్లు, చిక్కుళ్ళు, గింజలతో సహా పోషకాలు కలిగిన ఇతర ఆహార పదార్థాలు అందని వారిని అధ్యయనంలో చేర్చింది. 2019-21 (NFHS-5) నుండి జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే డేటాను విశ్లేషించడం ద్వారా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌తో పరిశోధకులు ఓ విషయాన్ని కనుగొన్నారు.


దేశంలో కనీస ఆహార వైవిధ్య వైఫల్యం మొత్తం రేటు 87.4 శాతానికి పడిపోయిందని కనుగొన్నారు. 2005-06 (NFHS-3) డేటాను ఉపయోగించి ఈ గణాంకాలు చేశారు. భారత్లో పోషకాహార లోపం ఎక్కువగా (75 శాతం పైన) ఉందని నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది. ఈ బృందం 2019-21 నుంచి 2005-06 నుండి డేటాను పోల్చి చూసింది. ఇందులో పిల్లల ఆహార అలవాట్లను కూడా పరిశీలించింది.


పోషకాహార లోపం ఉన్నప్పటికీ దేశీయంగా గుడ్ల వినియోగం బాగా పెరిగింది. NFHS-3లో 5 శాతంగా ఉన్న వినియోగం NFHS-5లో 17 శాతానికి పైగా పెరిగింది. అయితే చిక్కుళ్ళు, గింజల వినియోగం 2005-06లో దాదాపు 14 శాతం నుండి 17 శాతానికి(2019-21) పెరిగింది. విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు, కూరగాయల వినియోగం 7.3 శాతం, మాంసాహారం వినియోగం 4 శాతం పెరిగింది. అయినప్పటికీ, తల్లిపాలు, పాల ఉత్పత్తుల వినియోగం NFHS-3లో 87, NFHS-5లో 85 శాతం నుంచి వరుసగా 54, 52 శాతానికి పడిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు చొరవ తీసుకుని పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.

For Latest News and National News Click here

Updated Date - Oct 23 , 2024 | 03:13 PM