Share News

Arunachal CM: అరుణాచల్ సీఎంగా తిరిగి పెమా ఖండూ.. లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక

ABN , Publish Date - Jun 12 , 2024 | 07:55 PM

బీజేపీ నేత పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ లెజిస్లే చర్ పార్టీ నేతగా బుధవారంనాడు తిరిగి ఎన్నికయ్యారు. దీంతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

Arunachal CM: అరుణాచల్ సీఎంగా తిరిగి పెమా ఖండూ.. లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక

ఇటానగర్: బీజేపీ నేత పెమా ఖండూ (Pema Khandu) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా బుధవారంనాడు తిరిగి ఎన్నికయ్యారు. దీంతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిశీలకులైన రవిశంకర్ ప్రసాద్, తరుణ్ చుగ్ సమక్షంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై పెమా ఖండూను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఎంపీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా హాజరయ్యారు.

Odisha CM Sworn: ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం


వరుసగా మూడోసారి..13న ప్రమాణస్వీకారం

లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన పెమా ఖండూ సీఎం పదవిని చేపట్టనుండటం వరుసగా ఇది మూడోసారి కానుంది. ఈనెల 13వ తేదీ గురువారంనాడు తన క్యాబినెట్ మంత్రులతో కలిసి ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. పెమా ఖండూ తొలిసారి 2016లో సీఎం అయ్యారు. కాగా, ఇటీవల ముగిసిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను బీజేపీ 46 సీట్లు గెలుచుకుని తమ సత్తా చాటుకుంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 07:57 PM