Share News

LokSabha Elections: ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్

ABN , Publish Date - May 09 , 2024 | 01:27 PM

సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం హోరా హోరీగా సాగుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర మంత్రి, అమేఠీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు బీజేపీ సిద్దమని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.

LokSabha Elections: ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్

అమేఠీ, మే 09: సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం హోరా హోరీగా సాగుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర మంత్రి, అమేఠీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు బీజేపీ సిద్దమని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. అందులోభాగంగా ఏ టెలివిజన్ చానెల్‌లోనైనా.. ఏ యాంకర్ సమక్షంలోనానై... ఏ అంశంపైన అయినా ఎప్పుడైనా, ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.

అయితే ఈ చర్చలో ఓ వైపు తాము కూర్చుంటామని.. మరోవైపు వీరిద్దరు కూర్చుంటే.. మీరు చేస్తున్న ఆరోపణలకు తాము సమాధానం ఇస్తామన్నారు. అయితే వీరి ఆరోపణలకు, సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు తమ పార్టీ అధికార ప్రతినిధి సుదాంశు త్రివేది సరిపోతారని ఈ సందర్భంగా స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ప్రధాని మోదీపైన ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో స్మృతి ఇరానీ ఈ విధంగా స్పందించారు.


అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి స్మృతీ ఇరానీ మరోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో ఆమె చేతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ ఓటమిపాలయ్యారు. అయితే ఈ సారి రాహుల్ గాంధీ.. అమేఠీ నుంచి కాకుండా రాయ్‌బరేలి నుంచి పోటీకి దిగారు.

అమేఠీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కేఎల్ శర్మను ఆ పార్టీ అధిష్టానం బరిలో దింపింది. గాంధీ కుటుంబానికి అమేఠి కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది ఆ స్థానం నుంచి గాంధీ కుటుంబంలోని వారు కాకుండా.. బయట వారు బరిలో దిగడంతో ఈ అంశంపై బీజేపీ ఆరోపణలు సందించింది. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఒప్పుకున్నట్లు అయిందని బీజేపీ ఆరోపించింది.


మరోవైపు రాయ్‌బరేలీలో ఆమె సోదరుడు రాహుల్ గాంధీ గెలుపు బాధ్యతను ప్రియాంక గాంధీ భుజానికి ఎత్తుకున్నారు. ఆ క్రమంలో నియోజకవర్గంలోని రాహుల్ గెలుపు కోసం.. పకడ్బందీ వ్యూహాం, ఎన్నికల నిర్వహణ, ప్రచారంకు సంబంధించిన అంశాల్లో ప్రియాంక తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇక గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియాగాంధీ గెలుపొందారు.

కానీ ఆమె ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికయ్యారు. దీంతో ఆ స్థానం నుంచి రాహుల్ బరిలో దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ మరోసారి తమ అభ్యర్థిగా బరిలో దింపింది. గత ఎన్నికల్లో సైతం సోనియా గాంధీపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేసి ఓటమి పాలైన విషయం విధితమే.

Read Latest Natinal News And Telugu News

Updated Date - May 09 , 2024 | 02:19 PM