Share News

PNB Fraud Case: నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల ఆస్తి జప్తు

ABN , Publish Date - Sep 11 , 2024 | 07:38 PM

పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవకతవకలకు పాల్పడిన కేసులో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్నారు. 2018లో ఈ కేసు వెలుగుచూసింది.

PNB Fraud Case: నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల ఆస్తి జప్తు
Neerav Modi

న్యూఢిల్లీ: పంజాబ్ నేషన్ బ్యాంక్ కుంభకోణం కేసు (PNB Fraud Case)లో చిక్కుకుని దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi)కి చెందిన రూ.29.75 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. రూ.6,486 కోట్ల మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసు విచారణలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ అధికారులు బుధవారం నాడు తెలిపారు. ఈడీ జప్తు చేసిన వాటిల్లో స్థిరాస్తులు, ఇండియాలో బ్యాంకు బ్యాలెన్స్‌లు ఉన్నట్టు చెప్పారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)-2002 కింద ముంబై జోనల్ కార్యాలయం ఈ జప్తులు చేపట్టింది.


పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవకతవకలకు పాల్పడిన కేసులో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్నారు. 2018లో ఈ కేసు వెలుగుచూసింది. ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీ హౌస్ బ్రాంచ్ నీరవ్ మోదికి అనైథరైజ్డ్ ఎల్‌ఓయూలు జారీ చేసింది. విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తూ ఈ ఎల్ఓయూలు జారీ అయ్యారు. తద్వారా పీఎన్‌కీ రూ.6,498 కోట్ల మేరకు నష్టం జరిగింది. కొందరు బ్యాంకు అధికారులు కుమ్మక్కు కావడం వల్లే ఈ తప్పుడు లావాదేవీల వ్యవహారం చాలా ఏళ్ల వరకూ వెలుగుచూడలేదు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు


ఇంతవరకూ ఎంత జప్తు చేశారంటే...

నీరవ్ మోదీ, ఆయన అసోసియేట్లకు చెందిన దేశ, విదేశాల్లోని రూ.2,596 కోట్ల స్థిర చరాస్తులను ఈడీ ఇంతవరకూ జప్తు చేసింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం (ఎఫ్ఈఓఏ)-2018 కింద ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మరో రూ.692.90 కోట్ల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. పీఎన్‌బీ స్కామ్ మాస్టర్ మైండ్ నీరవ్ మోదీని లండన్‌ నుంచి రప్పించే ప్రయత్నాలు భారత్ చేస్తోంది. 2019లో లండన్‌లో అరెస్టయిన నీరవ్ మోదీ ‌పలు లీగల్ సవాళ్ల కారణంగా అక్కడ కస్టడీలో ఉన్నారు.


Read More Nationa News and Latest Telugu News

Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..

Updated Date - Sep 11 , 2024 | 08:28 PM