Share News

Supreme Court: సుప్రీంకోర్ట్ తదుపరి సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర

ABN , Publish Date - Oct 24 , 2024 | 08:59 PM

సుప్రీంకోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసిన నియామకాన్ని ఆమె గురువారం నోటిఫై చేశారు.

Supreme Court: సుప్రీంకోర్ట్ తదుపరి సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర
justice Sanjiv Khanna

న్యూఢిల్లీ: సుప్రీంకోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసిన నియామకాన్ని ఆమె గురువారం నోటిఫై చేశారు. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనుండడంతో నవంబర్ 10న సుప్రీంకోర్ట్ 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు.


ఈ విషయాన్ని కేంద్ర లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘భారత రాజ్యాంగం ద్వారా దక్కిన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో సంప్రదింపులు జరిపిన అనంతరం భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించడం నాకు సంతోషంగా ఉంది. 11 నవంబర్, 2024 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది’’ అని వెల్లడించారు.

కాగా సుప్రీంకోర్ట్ నియమాల ప్రకారం ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడు తదుపరి తన కింద ఉన్న జడ్జిల్లో సీనియర్ అయిన జస్టిస్ ఖన్నా పేరును ఇదివరకే సిఫార్సు చేశారు.

Updated Date - Oct 24 , 2024 | 09:08 PM