Share News

Puja Khedkar: పూజా కేడ్కర్‌కు ఊరట.. తక్షణ కస్టడీ అవసరం లేదన్న హైకోర్టు

ABN , Publish Date - Aug 12 , 2024 | 02:46 PM

మోసం, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ కు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. తక్షణ కస్టడీ అవసరం లేదంటూ ఆమెకు ఆగస్టు 21వ తేదీ వరకూ కోర్టు రక్షణ కల్పించింది.

Puja Khedkar: పూజా కేడ్కర్‌కు ఊరట.. తక్షణ కస్టడీ అవసరం లేదన్న హైకోర్టు

న్యూఢిల్లీ: మోసం, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ (Puja Khedkar)కు ఢిల్లీ హైకోర్టు (Delhi High court)లో తాత్కాలిక ఉపశమనం లభించింది. తక్షణ కస్టడీ అవసరం లేదంటూ ఆమెకు ఆగస్టు 21వ తేదీ వరకూ కోర్టు రక్షణ కల్పించింది. తదుపరి విచారణ తేదీ వరకూ ఆమెను కస్టడీలోకి తీసుకోరాదని యూపీఎస్‌సీ, ఢిల్లీ పోలీసులకు ఆదేశాలిచ్చింది.


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన ఆరోపణలను పూజా కేడ్కర్ ఎదుర్కొంటున్నారు. ముందస్తు బెయిలు కోరుతూ ఆమె వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్ విచారణ జరిపి తాజా ఆదేశాలిచ్చారు. పూజా ఖేడ్కర్ తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా, యూపీఎస్‌సీ తరఫున నరేష్ కౌశిత్ కోర్టుకు హాజరయ్యారు.

Shashi Tharoor: షేక్ హసీనా భారత్‌లో ఉండడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు


పూజా ఖేడ్కర్ పుణెలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చారు. ఈ క్రమంలోనే యూపీఎస్‌సీకి ఆమె తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే విషయం బయటకు వచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్‌సీ ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్‌లో పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సెషన్స్ కోర్టును పూజ కేడ్కర్ ఆశ్రయించగా, అందుకు కోర్టు ఆగస్టు 1న నిరాకరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును పూజా ఖేడ్కర్ ఆశ్రయించారు. పూజపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చేందుకు తగిన సమయం కావాలని సిద్ధార్ధ్ లూథ్రా కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 21వ తేదీ వరకూ ఆమెను కస్టడీలోకీ తీసుకోరాదని హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 02:46 PM