Share News

2026 మార్చికి పోలవరం మొదటి దశ పూర్తి

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:46 AM

పోలవరం ప్రాజెక్టు మొదటి దశ 2026 మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి తెలిపారు.

2026 మార్చికి పోలవరం మొదటి దశ పూర్తి

రాజ్యసభలో కేంద్ర మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి

న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు మొదటి దశ 2026 మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి తెలిపారు. సోమవారం, రాజ్యసభలో బీజేపీ ఎంపీ సస్మిత్‌ పాత్ర అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 ఏప్రి ల్‌ 1 నుంచి నీటి పారుదల పనులకు సంబంధించి నూటికి నూరు శాతం నిధులను తిరిగి చెల్లించాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. 2023-24లో రూ.274.93 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. నిర్మాణ సంస్థను మార్చడం, భూసేకరణ, కొవిడ్‌ కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 03:46 AM