Share News

Rajasthan: కాళ్లను తాడుతో కట్టి, బైక్‌తో లాగి..

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:41 PM

నాగౌర్‌లో ప్రేమరామ్ మేఘవాల్ దంపతులు నివసిస్తున్నారు. ప్రేమరామ్ మద్యానికి బానిస అయ్యాడు. భార్యపై అనుమానం.. అందరికీ దూరంగా ఉంచాడు. తన సోదరి వద్దకు వెళదాం అనుకుంది. ఆ అంశంపై భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. వద్దని భర్త స్పష్టం చేశాడు. వెళతానని భార్య భీష్మించుకొని కూర్చొంది. దీంతో ప్రేమరామ్‌కు కోపం వచ్చింది.

Rajasthan: కాళ్లను తాడుతో కట్టి, బైక్‌తో లాగి..
Rajasthan Man Drags Wife

నాగౌర్: కొందరిలో మానవత్వం ఉండటం లేదు. మంచి అస్సలే లేదు. తాగుబోతులకు బంధాలు, బంధుత్వాలు తెలియదు. కట్టుకున్న భార్యపై ప్రతాపం చూపిస్తుంటారు. రాజస్థాన్ నాగౌర్‌లో ఇలాంటి ఘటన జరిగింది. ఓ తాగుబోతు భర్త.. భార్య పట్ల కర్కశంగా వ్యవహరించాడు.


ఇంతకీ ఏం జరిగిందంటే..?

నాగౌర్‌లో ప్రేమరామ్ మేఘవాల్ దంపతులు నివసిస్తున్నారు. ప్రేమరామ్ మద్యానికి బానిస అయ్యాడు. భార్యపై అనుమానం.. అందరికీ దూరంగా ఉంచాడు. తన సోదరి వద్దకు వెళదాం అనుకుంది. ఆ అంశంపై భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. వద్దని భర్త స్పష్టం చేశాడు. వెళతానని భార్య భీష్మించుకొని కూర్చొంది. దీంతో ప్రేమరామ్‌కు కోపం వచ్చింది.


not-mna.jpg

కాళ్లను తాడుతో కట్టి..

భార్యపై కోపంతో ఉన్న ప్రేమరామ్.. ఆమె కాళ్లు, చేతులను తాడుతో కట్టాడు. దీంతో మహిళ అచేతనంగా మారింది. ఆ తాడును టూ వీలర్‌కు కట్టాడు. సోదరి దగ్గరకు వెళతావా అంటూ కొన్ని రౌండ్లు తిప్పాడు. ఆ దారి రాళ్లతో ఉండటంతో గాయ పడింది. పక్కనే జనం ఉన్న ఎవరు కలుగజేసుకోలేదు. సాయం చేయండి.. హెల్ప్ హెల్ప్ అని అరిచిన పట్టించుకోలేదు. ఘటనను వీడియో తీసేందుకు మాత్రం ఇంట్రెస్ట్ చూపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. పోలీసుల దృష్టికి రావడంతో విషయం ఆరా తీశారు. ఈ ఘటన నెలరోజుల క్రితం జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వెలుగులోకి రాలేదు.


బంధువుల ఇంట్లో మహిళ

బాధిత మహిళ భర్తతో విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ఘటన గురించి ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దాంతో పోలీసులు మరోలా కేసు ఫైల్ చేశారు. ప్రజలను ఇబ్బందికి గురిచేశావని కేసు నమోదు చేశారు. ప్రేమరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి గట్టిగా బుద్ది చెప్పాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Read More
National News
and Latest Telugu News

Updated Date - Aug 13 , 2024 | 04:41 PM