Share News

ఇద్దరు హేమంత్‌ సోరెన్‌లు..!

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:58 AM

మనుషులను పోలిన మనుషులు లోకంలో చాలా మందే ఉంటారు. అయితే.. అలా పోలిక ఉన్న వారిలో ప్రముఖులు ఉంటే.. అది ఆసక్తికర చర్చకు దారి తీస్తుంది.

ఇద్దరు హేమంత్‌ సోరెన్‌లు..!

మనుషులను పోలిన మనుషులు లోకంలో చాలా మందే ఉంటారు. అయితే.. అలా పోలిక ఉన్న వారిలో ప్రముఖులు ఉంటే.. అది ఆసక్తికర చర్చకు దారి తీస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరూ ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఒకే పోలికతో ఉన్నారు. వీరిలో ఎడమ వైపున ఉన్న వ్యక్తి ఝార్ఘండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌.. మరొకరు రాంచీకి చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మున్నా లోహ్రా. సీఎం నివాసంలో సోరెన్‌ను మున్నా తన కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ సరదాగా సంభాషించుకున్నారు. ఈ ఫొటోను సోరెన్‌.. తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘హేమంత్‌ సోరెన్‌ను కలిసిన హేమంత్‌’’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఈ ఫొటో వైరల్‌ కావడంతో పలువురు నెటిజన్లు సరదాగా రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Sep 27 , 2024 | 03:58 AM