Punjab: శివసేన నేతపై పట్టపగలే కత్తులతో దాడి..పరిస్థితి విషమం
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:50 PM
పంజాబ్ శివసేన నేత సందీప్ థాపర్ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉంటే లూథియానా ప్రభుత్వాసుపత్రి వెలుపల శుక్రవారం మధ్యాహ్నం ఈ దాడి ఘటన చోటుచేసుకుంది.
లూథియానా: పంజాబ్ శివసేన (Shiv Sena) నేత సందీప్ థాపర్ (Sandeep Thapar)పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉంటే లూథియానా ప్రభుత్వాసుపత్రి వెలుపల శుక్రవారం మధ్యాహ్నం ఈ దాడి ఘటన చోటుచేసుకుంది.
Bridge collaps: గంగోత్రికి దగ్గర్లో కుప్పకూలిన తాత్కాలిక వంతెన, నిలిచిపోయిన యాత్రికులు
సంఘటన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని సంవేద్నా ట్రస్టు (ఎన్జీఓ) వ్యవస్థాపకుడు రవీంద్ర అరోరా నాలుగో వర్దంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు థాపర్ వచ్చారు. అది ముగిసిన వెంటనే ఆయన బయటకు వచ్చి తన గన్‌మెన్‌తో కలిసి బైక్‌పై బయలుదేరారు. థాపర్‌ను అనుసరించిన గుర్తుతెలియని నిహాంగ్ సిక్కులు ఆయనను అడ్డుకుని ఘర్షణకు దిగారు. అగంతకులలో ఒకరు పొడవాటి కత్తిపై థాపర్ తలపై దాడికి దిగడంతో ఆయన తనను విడిచిపెట్టాలంటూ చేతులు జోడించి వేడుకున్నారు. ఈ క్రమంలో స్కూటర్ నుంచి అదుపుతప్పి కిందపడిన థాపర్‌పై మరో నిహాంగ్ కత్తితో దాడి చేశాడు. అక్కడితో చేరిన జనంతో పాటు థాపర్ గన్‌మెన్ కూడా అగంతకులను ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. దాడి అనంతరం అగంతకులు థాపర్ స్కూటర్‌పైనే పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన థాపర్‌ను స్థానిక దయానంద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. కాగా, అగంతకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు డీసీపీ జస్కిరాన్జిత్ సింగ్ తేజ తెలిపారు. ఈ ఘటన అనంతరం శివసేన కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పంజాబ్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలతో నిరసలకు దిగారు. థాపర్‌కు ముగ్గురు గన్‌మెన్‌లతో రక్షణ ఉన్నప్పటికీ గత వారంలో ఆయన భద్రతను కుదించారు.