Share News

Uttar Pradesh: బీజేపీ నేతలకు దూరంగా ఉండాలి.. సొంతపార్టీ నాయకులకు అఖిలేష్ వార్నింగ్..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 06:59 PM

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి సంతోషానిచ్చాయి. వూహించినదానికంటే ఎక్కువ సీట్లు రావడం, బీజేపీ బలంగా ఉన్నచోట్ల ఓడిపోవడంతో కమలం బలం తగ్గుతుందని.. ఎస్పీ బలం పెరుగుతుందనే అంచనాకు అఖిలేష్ యాదవ్ వచ్చినట్లు తెలుస్తోంది.

Uttar Pradesh: బీజేపీ నేతలకు దూరంగా ఉండాలి.. సొంతపార్టీ నాయకులకు అఖిలేష్ వార్నింగ్..!
Akhilesh Yadav

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి సంతోషానిచ్చాయి. వూహించినదానికంటే ఎక్కువ సీట్లు రావడం, బీజేపీ బలంగా ఉన్నచోట్ల ఓడిపోవడంతో కమలం బలం తగ్గుతుందని.. ఎస్పీ బలం పెరుగుతుందనే అంచనాకు అఖిలేష్ యాదవ్ వచ్చినట్లు తెలుస్తోంది. 2027లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. 2022 ఎన్నికల్లో సత్తా చాటి వరుసగా రెండోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది. రానున్న ఎన్నికలనాటికి యోగి పాలన పదేళ్లు పూర్తవ్వడంతో పాటు.. సాధారణంగా ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత తమకు కలిసొస్తుందని.. రానున్న ఎన్నికల్లో యూపీలో ఎస్పీ ప్రభుత్వం ఏర్పడుతుందనే విశ్వాసంతో అఖిలేష్ యాదవ్ ఉన్నారు. మరోవైపు యూపీ బీజేపీలో అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయనే ప్రచారం ఎక్కువుగా జరుగుతోంది. ప్రస్తుతం కొందరు బీజేపీ నేతలు ఎస్పీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ నాయకులను చేర్చుకోవడానికి అఖిలేష్ యాదవ్ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ఓడిపోతామనే భయంతోనే కొందరు బీజేపీ నేతలు ఎస్పీలో చేరే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటివారికి దూరంగా ఉండాలని అఖిలేష్ చెప్పారట.

Nirmala Sitaraman: బడ్జెట్‌పై 'వివక్ష' ముద్ర దారుణం.. మండిపడిన నిర్మలా సీతారామన్

సొంత నేతలకు వార్నింగ్..

బీజేపీ నేతలకు దూరంగా ఉండాలని సమాజ్ వాదీ పార్టీ నాయకులను అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. బీజేపీ నేతలను సమాజ్‌వాదీ పార్టీలోకి తీసుకోవడాన్ని సమర్థించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారట. బీజేపీలో అయోమయం నెలకొందని.. నాయకులంతా సేఫ్ జోన్ చూసుకుంటున్నారని.. అలాంటి వారిని చేర్చుకోవద్దని అఖిలేష్ స్పష్టం చేశారట. లోక్ సభ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం చేయడంపైనే ఎస్పీ అధినేత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.


పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న అఖిలేష్ యాదవ్‌ను తాజాగా పశ్చిమ యూపీకి చెందిన ఓ నేత కలిశారు. గతంలో అఖిలేష్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అఖిలేష్‌ను కలిసేందుకు తనతో పాటు బీజేపీ నేతను కూడా తీసుకెళ్లారు. బీజేపీ నేతకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌పై హామీ ఇవ్వాలని ఆయన అఖిలేష్‌‌ను కోరారు. కానీ ఎస్పీ అధినేత స్పందన మరోలా ఉంది. టికెట్‌పై హామీ కాదు కదా.. బీజేపీ నాయకుడిని కలవడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో ఢిల్లీలోని అఖిలేష్ నివాసం బయట బీజేపీ నేతలు కారులోనే ఉండిపోయారు. మరోసారి ఇలాంటి పని చేయవద్దని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడికి అఖిలేష్ సూచించారట.

Bangladesh: సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్


లోక్‌సభ ఫలితాల తర్వాత..

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి సమాజ్‌వాదీ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. బీజేపీలో మాత్రం కొంత గందరగోళం నెలకొంది. సీనియర్ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు బీజేపీ నాయకులు సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. టికెట్ హామీ ఇస్తే సైకిల్ ఎక్కేస్తామంటూ ముందుకొస్తున్నారు. కానీ ఎస్పీ అధినేత మాత్రం బీజేపీ నేతలను చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్‌గా లేనట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నాయకులకు అఖిలేష్ తన పార్టీలోకి ఎంట్రీని క్లోజ్ చేశారనే చర్చ సాగుతోంది.


Watch Video: సోనియాగాంధీ, జయాబచ్చన్ కలుసుకున్న వేళ...

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 24 , 2024 | 06:59 PM