Share News

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

ABN , Publish Date - Feb 01 , 2024 | 08:10 PM

దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని(Aeroplan Services) ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

అయోధ్య: దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని(Aeroplane Services) ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath), కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కలిసి స్పైస్ జెట్ విమాన సేవల్ని ప్రారంభించారు.


"దర్బంగా, అహ్మదాబాద్, చెన్నై, జైపుర్, పట్నా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి అయోధ్యకు వచ్చే భక్తులకు స్పైస్ జెట్ నాన్ స్టాప్ సేవల్ని అందించనుంది. దీంతో కనెక్టివిటీ పెరగడంతోపాటు.. అయోధ్యలో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుంది. గతంలో ఈ ప్రాంతం కొన్ని కారణాల వల్ల నిర్లక్ష్యానికి గురైంది. అయోధ్య ధామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం నగర అభివృద్ధిలో కీలక మైలు రాయిగా నిలిచింది. అయోధ్య దేశ విశ్వాసానికి చిహ్నం. ప్రజల మనోభావాలు శ్రీ రామ్ లల్లాతో ముడిపడి ఉన్నాయి. ప్రతి అయోధ్యవాసి నగర అభివృద్ధి కోసం ఆకాంక్షించారు. నేడు ఆ కల సాకారం అవుతోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన10 రోజుల్లో రామచంద్రుడి దర్శనం కోసం 25 లక్షల మందికిపైగా భక్తులు వచ్చారు" అని యోగీ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2024 | 12:20 PM