Home » Ayodhya Prana Prathista
ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో అర్షద్‌తో 19 ఏళ్ల మరియం షరీఫ్‌కు ఇటీవల వివాహమైంది. ఆ జంట తాజాగా అయోధ్యలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆయోధ్యలో జరిగిన అభివృద్ధి.. రామాలయ నిర్మాణం, నగరాభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇప్పటివరకు 2.85 కోట్ల మంది భక్తులు వచ్చారు. కోట్లాది రూపాయల విరాళాలు అందాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అంతేకాదు ఓ భక్తుడు 2100 కోట్ల రూపాయల చెక్కు కూడా ఇచ్చారని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తన కుటుంబానికి చెందినదని ఢిల్లీకి చెందిన మహిళ రాణీ పంజాబీ చెప్పారు.
ఇండియా డే పరేడ్‌లో(India Day Parade in New York) భాగంగా ఏటా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఇండియా డే పరేడ్‌లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆగస్టు 18న జరిగే ఇండియా డే పరేడ్‌లో అయోధ్యలోని రామ మందిర రూపం న్యూయార్క్ వీధుల్లో ప్రదర్శితం అవుతుంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు.. ఆర్నెల్లయినా కాకముందే.. కురిసిన తొలి భారీ వర్షానికే లీక్ అవుతోంది! శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.
బీజేపీ సర్కార్ 2024 జనవరి 22న ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అయోధ్య రాముడి ఆలయ(Ayodhya Ram Mandir) గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరాయి. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది.
అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ శనివారం తుదిశ్వాస విడిచారు.
గతంలో కన్నా ఈసారి ఎన్డీఏ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయని అందరూ..
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ కీలక అప్డేట్ చేసింది. శ్రీరామనవమి కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన వీవీఐపీ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీ రాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై ఉంది.