Share News

Lok Sabha Elections 2024: ప్రధానమంత్రి అయ్యేది ఆయనే.. అయోధ్య ప్రధాన పూజారి జోస్యం

ABN , Publish Date - Jun 03 , 2024 | 07:19 PM

గతంలో కన్నా ఈసారి ఎన్డీఏ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయని అందరూ..

Lok Sabha Elections 2024: ప్రధానమంత్రి అయ్యేది ఆయనే.. అయోధ్య ప్రధాన పూజారి జోస్యం
Ayodhya Ram Mandir Chief Priest Prediction On Lok Sabha Elections 2024

గతంలో కన్నా ఈసారి ఎన్డీఏ (NDA) భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls 2024) అంచనా వేసిన నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ఫలితాలు ఎలా వస్తాయని అందరూ చర్చించుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు నరేంద్ర మోదీ (Narendra Modi) మూడోసారి ప్రధాని పీఠం ఎక్కుతారా? లేక అందుకు భిన్నంగా రిజల్ట్స్ వస్తాయా? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో.. అయోధ్యలోని రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Acharya Satyendra Das) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ప్రధాని అవుతారనే విషయంపై జోస్యం చెప్పారు.


Read Also: క్రికెట్‌లో విషాదం.. సిక్స్ కొట్టిన తర్వాత ప్రాణం విడిచిన క్రికెటర్

ఈసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధానమంత్రి అవుతారని సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన ముచ్చటగా మూడోసారి మోదీ ఈ భారతదేశానికి ప్రధాని అవుతారని, ఆయనకు రామ్‌లల్లా ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. ఈ సంవత్సరంలో ఆయన మరెన్నో విజయాలు సాధిస్తారని కూడా జోస్యం చెప్పారు. ‘‘రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపన జరిగినప్పటి నుంచి ఆ రాముడి ఆశీస్సులతో పాటు మా ఆశీర్వాదాలు ప్రధాని మోదీపై ఉన్నాయి. మూడోసారి మోదీనే ప్రధాని అవ్వాలని నేను ఆ రాముడిని ప్రతిరోజూ ప్రార్థిస్తూనే ఉన్నా. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ జూన్ 4న మూడోసారి ప్రధాని అవుతారు’’ అని సత్యేంద్ర దాస్ చెప్పుకొచ్చారు.


Read Also: అమ్మాయికి దెయ్యం పట్టిందన్నాడు.. రూమ్‌లోకి వెళ్లాడు.. తీరా చూస్తే..

ఇదిలావుండగా.. జూన్ 1వ తేదీన సాయంత్రం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేనే ఘనవిజయం సాధిస్తాయని తెలిపాయి. దాదాపు ప్రతి ఏజెన్సి కూడా.. ఎన్డీఏకు 350కి పైగా సీట్లు రావొచ్చని జోస్యం చెప్పాయి. గతంలో కన్నా ఈసారి ఎన్డీఏకు భారీ సీట్లు వస్తాయని, కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని అంచనా వేశాయి. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఆయన మరోసారి ప్రధాని పీఠం అధిరోహిస్తాయని వెల్లడించాయి. కానీ.. ఇండియా కూటమి నేతలు మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్‌ని కొట్టేస్తున్నారు. ఇవన్నీ ఫేక్ లెక్కలని.. తమ కూటమే అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. మరి.. ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 07:26 PM