Planes Collide: గాల్లో ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఆ తర్వాత ఏమైందంటే?
ABN , Publish Date - Jun 03 , 2024 | 05:25 PM
పోర్చుగల్‌లోని బెజా నగరంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో సందర్భంగా.. రెండు స్టంట్ విమానాలు గాల్లో ఢీ కొట్టుకున్నాయి. ఇందులో...
పోర్చుగల్‌లోని (Portugal) బెజా నగరంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో సందర్భంగా.. రెండు స్టంట్ విమానాలు (Planes Collide) గాల్లో ఢీ కొట్టుకున్నాయి. ఇందులో ఒక విమానం నేలను బలంగా తాకడంతో.. మంటలు చెలరేగాయి. దీంతో.. ఆ విమానంలోనే పైలట్ దుర్మరణం చెందాడని ‘పోర్చుగీస్ వైమానిక దళం’ (పీఏఎఫ్) పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: విరాట్ కోహ్లీపై సంచలనం.. అలాగైతే జట్టులో ఉండి దండగ!
పోర్చుగల్‌లోని లిస్బన్‌కు దక్షిణంగా 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజా నగరంలోని ఎయిర్‌బేస్‌లో పీఏఎఫ్ ఆదివారం ఎయిర్ షో నిర్వహించింది. ఇందులో మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు చేశాయి. ఈ క్రమంలోనే ఒక విమానం కింద నుంచి పైకి దూసుకెళ్లగా.. అది మరో విమానంతో ఢీకొంది. ఈ దెబ్బకు రెండూ కుప్పకూలాయి. ఒక విమానం ఎయిర్‌బేస్‌కు అవతల కుప్పకూలిపోగా.. మరొకటి బేస్‌లోనే నేలను గట్టిగా తాగి మంటల్లో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో స్పానిష్ పైలట్ మృతి చెందగా, పోర్చుగల్‌కి చెందిన మరో పైలట్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చొని.. ఎగ్జిట్ పోల్స్‌పై మమతా సెటైర్లు
పైలట్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక సాంకేతిక లోపం తలెత్తడం వల్ల విమానం అదుపు తప్పిందా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. పోర్చుగల్ రక్షణమంత్రి నునో మెలో ఈ ఘటనపై స్పందిస్తూ.. ప్రమాదానికి గల కారణాలేంటో త్వరలోనే గుర్తిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. యాక్ స్టార్స్ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాల్ని ప్రదర్శించింది. ఇందులో పోర్చుగల్‌తో పాటు స్పెయిన్‌కి చెందిన పైలట్లు పాల్గొన్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి.
Read Latest International News and Telugu News