Share News

Ayodhya Ram Mandir: అయోధ్య గర్భగుడిలోకి వర్షపు నీరు..

ABN , Publish Date - Jun 24 , 2024 | 08:30 PM

బీజేపీ సర్కార్ 2024 జనవరి 22న ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అయోధ్య రాముడి ఆలయ(Ayodhya Ram Mandir) గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరాయి. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది.

Ayodhya Ram Mandir: అయోధ్య గర్భగుడిలోకి వర్షపు నీరు..

అయోధ్య: బీజేపీ సర్కార్ 2024 జనవరి 22న ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అయోధ్య రాముడి ఆలయ(Ayodhya Ram Mandir) గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరాయి. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది. తొలిసారి వర్షం కురిసినప్పుడే గర్భాలయంలోకి నీరు వచ్చి చేరాయని ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ చెప్పారు. దీంతో రామ మందిర నిర్మాణ పటిష్టతపై అనుమానాలు వస్తున్నాయి.

ఆలయ పైభాగాన్ని సరిగ్గా అమర్చని వారిపై చర్యలు తీసుకోవాలని సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో ఉన్న సమస్యలేంటో గుర్తించి వాటిని ఒకట్రెండు రోజుల్లో పరిష్కరించాలని కోరారు. అసలే వర్షాకాలం కావడంతో సమస్య పరిష్కరించకుంటే పూజలు చేయడం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


అప్పటి వరకు ఆలయ నిర్మాణం అసాధ్యం...

"2025కు కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉంది. చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. కాబట్టి, నిర్మాణ పనులు ఏడాదిలోపు పూర్తయ్యే అవకాశం లేదు. నిర్ణీత స్థలాల్లో ఇతర దేవుళ్ల విగ్రహాలు ఉంచే పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదికల్లా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఏర్పడిన సమస్యను అధికారులు పరిశీలించి పరిష్కరించాలి. వర్షపు నీరంతా రామ్ లల్లా విగ్రహం చుట్టూ వచ్చి చేరాయి. ఆలయంలో లీకేజీ సమస్య ముఖ్యమైంది. దానిని త్వరగా పరిష్కరించాలి" అని సత్యేంద్ర దాస్ అధికారులను కోరారు.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 08:47 PM