Share News

Elon Musk : ఎలాన్‌ మస్త్‌ స్త్రీలోలుడు!

ABN , Publish Date - Jun 13 , 2024 | 05:02 AM

స్పేస్‌ ఎక్స్‌, టెస్లా కంపెనీల అధిపతి ఎలాన్‌ మస్క్‌.. తన వద్ద పనిచేసిన పలువురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌

Elon Musk : ఎలాన్‌ మస్త్‌ స్త్రీలోలుడు!

  • తన వద్ద పనిచేసిన ఉద్యోగినులతో..

  • లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు

  • ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ సంచలన కథనం

న్యూయార్క్‌, జూన్‌ 12: స్పేస్‌ ఎక్స్‌, టెస్లా కంపెనీల అధిపతి ఎలాన్‌ మస్క్‌.. తన వద్ద పనిచేసిన పలువురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. తన కన్నా వయసులో 20 ఏళ్లు చిన్నదైన యువతి ఇంటర్న్‌షిప్‌ కోసం వస్తే.. మస్క్‌ ఆమెతో డేటింగ్‌ చేసి, సిసిలీలోని ఓ రిసార్టుకు తీసుకెళ్లి శృంగారంలో పాల్గొన్నారని ఆ కథనంలో పేర్కొంది. అలాగే.. తనతో పిల్లల్ని కనాలంటూ మరో మహిళా ఉద్యోగినిని కూడా మస్క్‌ అడిగారని, కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదని వెల్లడించింది. 2013లో ఆమె స్పేస్‌ఎక్స్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. మరొక ఉద్యోగిని.. 2014లో మస్క్‌తో నెలరోజులపాటు లైంగిక బంధంలో ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంబంధాలు చెడడంతో ఉద్యోగం మానేసినట్టు వెల్లడించింది. తనతో శృంగారంలో పాల్గొంటే గుర్రాన్ని కొనిపెడతానంటూ మస్క్‌ 2016లో తనను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని స్పేస్‌ ఎక్స్‌లో ఫ్లైట్‌ అటెండెంట్‌గా పనిచేసిన ఒక మహిళ ఆరోపించింది. ఇలా మస్క్‌ తన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీల్లో కల్పించిన వాతావరణంతో మహిళా ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. మస్క్‌తో శృంగారంలో పాల్గొన్న మహిళలు, వారి స్నేహితులు, కుటుంబసభ్యులతో మాట్లాడి.. పలు టెక్స్ట్‌ సందేశాలు, ఈమెయిళ్లు, ఇతర పత్రాలను పరిశీలించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ కథనాన్ని ప్రచురించింది.

Updated Date - Jun 13 , 2024 | 08:45 AM