Share News

Uddhav Thackeray: నన్ను వీడి వెళ్లిన వాళ్లను మాత్రం... తెగేసి చెప్పిన ఉద్ధవ్ థాకరే

ABN , Publish Date - Jun 15 , 2024 | 06:23 PM

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష 'మహా వికాస్ అఘాడి' విజయం ఆరంభం మాత్రమేనని, ముగింపు కాదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విపక్ష కూటమి కలిసే పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే శిబిరంలోని నేతలను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Uddhav Thackeray: నన్ను వీడి వెళ్లిన వాళ్లను మాత్రం... తెగేసి చెప్పిన ఉద్ధవ్ థాకరే

ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష 'మహా వికాస్ అఘాడి' (MVA) విజయం ఆరంభం మాత్రమేనని, ముగింపు కాదని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విపక్ష కూటమి కలిసే పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే శిబిరంలోని నేతలను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం 'మహా వికాస్ అఘాడి' తరఫున ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్(NCP-SP), పృధ్వీరాజ్ చవాన్ (Congress), ఇతర కూటమి నేతలు శనివారం తొలిసారి మీడియా సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు.

Sharad Pawar: మోదీ వచ్చిన చోటల్లా మేం గెలిచాం... పవార్ విసుర్లు


రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటమిది..

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాజ్యంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగే ఎన్నికలుగా ఉద్ధవ్ అభివర్ణించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్నది మోదీ ప్రభుత్వమని, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంగా మారిందని అన్నారు. ఎంతకాలం ఈ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందో చూడాల్సిందేనని పేర్కొ్న్నారు. ఎంవీఏ తప్పుడు ఆరోపణలు చేసిందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఉద్ధవ్ తోసిపుచ్చారు. ''మోదీ ఏమన్నారు? మంగళసూత్రాల ప్రస్తావన సరైనదేనా? 400 సీట్లు గెలుస్తామని చెప్పుకున్నారు. మంచిరోజులు వస్తాయన్నారు, మోదీ గ్యారెంటీలు ఏమయ్యాయి?'' అని ఆయన ప్రశ్నించారు. గతంలోని తమ 'ఎంవీఏ' ప్రభుత్వాన్ని దేవెంద్ర ఫడ్నవిస్ మూడు కాళ్ల రిక్షాతో పోల్చారని, ఇప్పుడు కేంద్రంలోని బేజీపీ పరిస్థితి సరిగ్గా మూడు కాళ్ల రిక్షా మాదిరిగానే ఉందని ఎద్దేవా చేశారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 15 , 2024 | 06:23 PM