Share News

Ganesh Chaturthi: ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:41 PM

మహారాష్ట్రలో గణేష్ చతుర్ధి ఉత్సవాలు వైభవంగా శనివారం మొదలయ్యాయి. గణేష్ ప్రతిమలతో మండపాల్లోనూ, ఇళ్లలోనూ వినాయకుడు కొలువుతీరుతున్నాడు. వినాయకుడికి స్వాగతం పలుకుతూ మండపాలను రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు సందర్శిస్తూ సందడి చేస్తున్నారు.

Ganesh Chaturthi: ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు

ముంబై: మహారాష్ట్రలో గణేష్ చతుర్ధి ఉత్సవాలు వైభవంగా శనివారం మొదలయ్యాయి. గణేష్ ప్రతిమలతో మండపాల్లోనూ, ఇళ్లలోనూ వినాయకుడు కొలువుతీరుతున్నాడు. వినాయకుడికి స్వాగతం పలుకుతూ మండపాలను రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. ముంబైలోని సుప్రసిద్ధ లాల్‌బాగ్చా వినాయకుని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. థాకరే భార్య రష్మి, కుమారుడు, ఆదిత్య థాకరే ప్రత్యేక పూజలు చేశారు.

Amit Shah: పాక్‌తో చర్చల్లేవ్... తెగేసిచెప్పిన అమిత్‌షా


గణపతి బప్పాకు సీఎం స్వాగతం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన అధికార నివాసమైన మలబార్ హిల్స్‌లోని హర్ష బంగ్లాలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు జరిపారు. ఏక్‌నాథ్ షిండేతో పాటు ఆయన కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, మనుమడు రుద్రాంష్ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణేష్ చతుర్ధి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, మహిళా సాధికారత కోసం పలు పథకాలను అమలు చేస్తున్నామని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షిండే తెలిపారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2024 | 03:41 PM