Share News

Indira Mother of India: ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి

ABN , Publish Date - Jun 15 , 2024 | 07:39 PM

కేరళ నుంచి తొలిసారి బీజేపీ ఎంపీగా ఎంపికై ఎకాఎకీన మోదీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయవేత్త సురేష్ గోపి శనివారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించారు.

Indira Mother of India: ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి

త్రిసూర్: కేరళ (Kerala) నుంచి తొలిసారి బీజేపీ ఎంపీగా ఎంపికై ఎకాఎకీన మోదీ 3.0 (Modi 3.0) ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయవేత్త సురేష్ గోపి (Suresh Gopi) శనివారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi)ని 'మదర్ ఆఫ్ ఇండియా' (Mother of India)గా అభివర్ణించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్‌ను సాహసవంతుడైన అడ్మినిస్ట్రేటర్‌గా పేర్కొన్నారు. కరుణాకరన్, మాజీ సీఎం ఈకే నయనార్‌లు తన రాజకీయ గురువులను తెలిపారు. తన నియోజకవర్గమైన త్రిసూర్‌లో కరుణాకరన్ మెమోరియల్‌ను సందర్శించిన సందర్భంగా సురేష్ గోపి ఈ వ్యాఖ్యలు చేశారు.


సురేష్ గోపి ఇటీవల త్రిసూర్ నియోజవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి తన సమీప సీపీఎం అభ్యర్థి వీఎస్ సునీల్‌కుమార్‌పై 75,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కరుణాకరన్ కుమారుడు కె.మురళీధరన్ మూడో స్థానంలో నిలిచారు.


రాజకీయాలను ఆపాదించవొద్దు..

కాగా, ఇందిరాగాంధీ, కరుణాకరన్‌లపై తాను చేసిన వ్యాఖ్యలకు రాజకీయాలను ఆపాదించవచ్చని కరుణాకరన్ మెమోరియల్‌ను సందర్శించిన అనంతరం మీడియా మాట్లాడుతూ సురేష్ గోపి కోరారు. తన గురువు పట్ల గౌరవాన్ని చాటుకునేందుకే తాను ఆయన మెమోరియల్‌కు వచ్చినట్టు చెప్పారు. ఈకే నయనార్ తరహాలోనే తన భార్య శారద కూడా టీచర్ అని, కరుణాకరన్, ఆయన భార్య కల్యాణి కుట్టి అమ్మతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. కరుణాకరన్‌ను 'సాహసిక అడ్మినేస్ట్రర్‌'గా చెప్పడమంటే కేరళలో కాంగ్రెస్ వ్యవస్థాపకులు, సహవ్యవస్థాపకులను తక్కువ చేసి మాట్లాడటం కాదని తెలిపారు. తన జనరేషన్‌లో కరుణాకరన్ చాలా ధైర్యవంతుడైన పరిపాలకుడని అన్నారు.


కాగా, ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పర్యాటక, పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి బాధ్యతలు చేపట్టారు. అయితే, తనకు సహాయ మంత్రి పదవి కేటాయించడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారని, మోదీ మంత్రివర్గం నుంచి రాజీనామా చేయనున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే, సురేష్ గోపి ఆ వార్తలను తోసిపుచ్చారు. కేరళ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ మోదీ ప్రభుత్వంలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 15 , 2024 | 07:52 PM