Vistara Flight: ముంబయి నుంచి ప్రాంక్‌ఫర్డ్ బయలుదేరి.. టర్కీలో ల్యాండైన విమానం
ABN , Publish Date - Sep 06 , 2024 | 09:19 PM
ముంబయి నుంచి ఫ్రాంక్‌ఫర్డ్ బయలుదేరిన విస్తారా సంస్థకు చెందిన యూకే 27 విమానం.. మార్గ మధ్యంలో తన గమ్యస్థానాన్ని మార్చుకుంది. ఆ క్రమంలో ఇస్తాంబుల్ రాజధాని టర్కీలో విమానం ల్యాండ్ అయింది. ఈ మేరకు విస్తారా సంస్థ శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పష్టం చేసింది.
ముంబయి, సెప్టెంబర్ 06: ముంబయి నుంచి ఫ్రాంక్‌ఫర్డ్ బయలుదేరిన విస్తారా సంస్థకు చెందిన యూకే 27 విమానం.. మార్గ మధ్యంలో తన గమ్యస్థానాన్ని మార్చుకుంది. ఆ క్రమంలో టర్కీలో విమానం ల్యాండ్ అయింది. ఈ మేరకు విస్తారా సంస్థ శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పష్టం చేసింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఫ్రాంక్‌ఫర్డ్‌కు కాకుండా.. టర్కీకి విమానాన్ని మళ్లించవలసి వచ్చిందని వివరించింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7.05 గంటలకు టర్కీలోని ఎర్జురం విమానాశ్రయంలో ఈ విస్తారా విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పష్టం చేసింది. విమానంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపింది.
ముంబయి నుంచి బయలుదేరిన ఈ విమానంలో భద్రతా లోపాలు తలెత్తాయని సమాచారం. ఈ నేపథ్యంలో విమాన సిబ్బంది ఎయిర్ పోర్ట్‌లోని ఏటీసీ అధికారులతో సంప్రదించారు. అనంతరం వారి సలహాలు సూచనల మేరకు విమానాన్ని టర్కీలో ల్యాండ్ చేసినట్లు తెలుస్తుంది.
మరోవైపు ఏ కారణంతో ఫ్రాంక్ ఫర్డ్ వెళ్లకుండా టర్కీలో విమానాన్ని దింపడానికి గల కారణాలను మాత్రం విస్తారా వివరించలేదు. ఇక ఇటీవల కాలంలో విమానాల్లో భారీ కుదుపులకు లోనవుతున్నాయి. దీంతో ప్రయాణీలకు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే విమానాల్లోని వస్తువులు సైతం చెల్లచెదురుగా పడిపోతున్నాయి.
ఇటువంటి పరిస్థితులు ఇటీవల లెక్కకు మిక్కిలిగా చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే తరహా ఘటన ఈ విమానంలో చోటు చేసుకుంటుందనే ఓ చర్చ సైతం సాగుతుంది. అందువల్లే.. ఈ విమానాన్ని టర్కీలో ల్యాండ్ చేసినట్లు తెలుస్తుంది.
Read More National News and Latest Telugu News Click Here