Share News

Washington : బర్మింగ్‌హామ్‌లో కాల్పులు

ABN , Publish Date - Jul 15 , 2024 | 02:50 AM

అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్‌లో శనివారం రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు.

Washington : బర్మింగ్‌హామ్‌లో కాల్పులు

  • ఏడుగురి మృతి.. 9 మందికి గాయాలు

వాషింగ్టన్‌, జూలై 14: అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్‌లో శనివారం రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు. శనివారం రాత్రి బర్మింగ్‌హామ్‌లోని నైట్‌క్లబ్‌పై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. 9 మంది గాయపడ్డారు. అంతకుముందు బర్మింగ్‌హామ్‌ నగరంలోనే ఇండియన్‌ సమ్మర్‌ డ్రైవ్‌ ప్రాంతంలో ఓ ఇంటిముందు కారులో బాలుడు, మహిళ సహా ముగ్గురు బుల్లెట్‌ గాయాలతో చనిపోయి కనిపించారు.

Updated Date - Jul 15 , 2024 | 02:50 AM