Share News

Eknath Shinde: 'గ్యాంగ్‌లు, గూండాలను ఏరిపారేస్తాం'.. సల్మాన్‌ను కలిసిన సీఎం షిండే

ABN , Publish Date - Apr 16 , 2024 | 09:04 PM

రాష్ట్రంలో సంచరించే గ్యాంగ్‌లు, గూండాలను కూకటి వేళ్లలో ఏరివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కాల్పుల ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ను సీఎం మంగళవారంనాడు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు తగు భద్రత కల్పిస్తుందని, కాల్పుల ఘటనలో ఎవరి హస్తం ఉన్నా వారిని విడిచిపెట్టేది లేదని ధైర్యం చెప్పారు.

Eknath Shinde: 'గ్యాంగ్‌లు, గూండాలను ఏరిపారేస్తాం'.. సల్మాన్‌ను కలిసిన సీఎం షిండే

ముంబై: రాష్ట్రంలో సంచరించే గ్యాంగ్‌లు, గూండాలను కూకటి వేళ్లలో ఏరివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) అన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కాల్పుల ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan)ను సీఎం మంగళవారంనాడు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు తగు భద్రత కల్పిస్తుందని, కాల్పుల ఘటనలో ఎవరి హస్తం ఉన్నా వారిని విడిచిపెట్టేది లేదని ధైర్యం చెప్పారు. సల్మాన్‌ తండ్రి సలీమ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖి, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖి, యువసేన నేత రాహుల్ కనెల్ ఈ సందర్భంగా హాజరయ్యారు.

Salman Khan house firing: మూడుసార్లు రెక్కీ, ఐదు రౌండ్ల కాల్పులు


అనంతరం మీడియాతో ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, ప్రభుత్వం మీ వెంటే ఉంటుుందని సల్మాన్‌ఖాన్‌కు కలిసి ధైర్యం చెప్పినట్టు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినందున మరింత సమాచారం రాబడుతున్నట్టు చెప్పారు. పరోక్షంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌‌ విషయాన్ని ప్రస్తావస్తూ...''మహారాష్ట్రలో ఇంకెంతమాత్రం గ్యాంగ్‌లు ఉండడానికి వీల్లేదు. కాల్పుల కేసులో అరెస్టయిన నిందితులను ఇంటరాగేట్ చేస్తున్నాం. ఎవరినీ విడిచిపెట్టం. సల్మాన్, ఆయన కుటుంబానికి అదనపు భద్రత కల్పించాలని పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలిచ్చాం. ప్రజల భద్రత మా బాధ్యత. గత ప్రభుత్వాల హయాంలో ఏమి జరిగిందనే దానిపై నేను వ్యాఖ్యానించను. మేము మాత్రం రాష్ట్రంలోని ఎవరికైనా హాని తలపెట్టే గ్యాంగులు, గూండాలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటాం'' అని అన్నారు. గత ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు సంబంధం ఉన్నట్టు విచారణలో నిందితులు అంగీకరించినట్టు ఇన్వెస్టిగేషన్ టీమ్ చెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 09:04 PM