Navya : కురుల ఆరోగ్యానికి.. అలొవెరా!
ABN , Publish Date - Jun 30 , 2024 | 11:27 PM
న్యూట్రిన్లు, విటమిన్లు, అమినో ఆమ్లాలుండే అలొవెరా చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
న్యూట్రిన్లు, విటమిన్లు, అమినో ఆమ్లాలుండే అలొవెరా చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇంట్లోని పెరటిలో ఉండాల్సిన మొక్క ఇది. ఇంతకీ అలొవెరాతో హెయిర్ ప్యాక్స్ చేసుకోవటమెలా?
అలొవెరా జెల్‌ను తలకు పట్టించుకుంటే.. జుట్టు రాలటం ఆగిపోతుంది. ముఖ్యంగా తలలో దురదలు తగ్గిపోతాయి.
బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి ఆరిన తర్వాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు తగ్గిపోతుంది. మాడు చల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది.
బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్, రెండున్నర స్పూన్ల కొబ్బరినూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే.. హెయిర్ డ్యామేజ్ కావటం ఆగిపోతుంది.
రెండున్నర టేబుల్ స్పూన్లు అలొవెరా జెల్‌కు.. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేయాలి. మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా పలుసార్లు చేస్తుంటే.. చుండ్రు పోతుంది. జుట్టు మిలమిలా మెరుస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. హెయిర్ ప్యాక్ కోసం బౌల్లో మూడు స్పూన్ల అలొవెరా జెల్ తీసుకుని.. ఇందులోకి మెంతుల పేస్ట్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుతుంది.
బౌల్లో అరకప్పు అలొవెరా జెల్ తీసుకుని.. ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక కోడిగుడ్డు వేసి స్పూన్‌తో మెత్తటి పేస్ట్‌లో చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.