Share News

Navya : పాలతో ఇలా చేస్తే...

ABN , Publish Date - May 19 , 2024 | 03:18 AM

వయసు పెరిగే కొద్దీ పలు కారణాల వల్ల జుట్టు తగ్గిపోతోందని ఆందోళన చెందనివారు ఉండరు. జుట్టు పోషణ కోసం, సంరక్షణ కోసం చాలామంది ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. జుట్టును సహజంగా బలోపేతం చేయగల పదార్థాల్లో పాలు ముఖ్యమైనవి.

Navya : పాలతో ఇలా చేస్తే...

వయసు పెరిగే కొద్దీ పలు కారణాల వల్ల జుట్టు తగ్గిపోతోందని ఆందోళన చెందనివారు ఉండరు. జుట్టు పోషణ కోసం, సంరక్షణ కోసం చాలామంది ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. జుట్టును సహజంగా బలోపేతం చేయగల పదార్థాల్లో పాలు ముఖ్యమైనవి.

  • ఆరోగ్యానికి పాలు మంచి పోషకాహారం అని మనకు తెలుసు. అంతేకాదు, పాలలో ఉండే కేసీన్‌ అనే ప్రోటీన్‌ వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పోషణలో పాలను ప్రధాన భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

  • పాలు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. జుట్టులో తేమను పెంచుతాయి. జుట్టును మెత్తగా, మృదువుగా మార్చుతాయి.

  • ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సివచ్చినపుడు... సూర్యకాంతిలో ఉండే అతినీల లోహిత కిరణాల వల్ల జుట్టు పొడిబారిపోయి, బిరుసుగా తయారవుతుంది. ఇలాంటి సందర్భాల్లో పాలను ఆహారంగానే కాకుండా జుట్టును శుభ్ర పరచడానికి కూడా వాడవచ్చు.

  • పాల మీగడ జుట్టు పొడిబారడాన్ని, బిరుసుదనాన్ని తగ్గించి... వెంట్రుకల చివర్లు చిట్లిపోవడాన్ని నిరోధిస్తుంది. పాలలోఉండే విటమిన్‌ సి, పలు యాంటీ ఆక్సిడెంట్లు... కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి.

  • జుట్టు ఒత్తిడికి గురై, బలహీనమై, పొడిబారి, తెగిపోతూఉన్నప్పుడు, పాలు ఆ సమస్యను తగ్గ్గిస్తాయి.

Updated Date - May 19 , 2024 | 03:18 AM