Blood Diet : రక్తగ్రూపును బట్టి ఆహారం!
ABN , Publish Date - Sep 03 , 2024 | 12:45 AM
తీసుకునే ఆహారం శరీర తత్వంతో సరిపోలితే అనారోగ్యాలను కలిగించే జిహ్వచాపల్యాలకు దూరంగా ఉండగలుగుతాం! ఈ సూత్రం ఆధారంగా వాడుకలోకొచ్చిన తాజా డైట్...‘బ్లడ్ గ్రూప్ డైట్’!
బ్లడ్ గ్రూప్ డైట్
తీసుకునే ఆహారం శరీర తత్వంతో సరిపోలితే అనారోగ్యాలను కలిగించే జిహ్వచాపల్యాలకు దూరంగా ఉండగలుగుతాం! ఈ సూత్రం ఆధారంగా వాడుకలోకొచ్చిన తాజా డైట్...‘బ్లడ్ గ్రూప్ డైట్’!
‘ఒ’ రక్త గ్రూపు: మిగతా రక్తగ్రూపులతో పోలిస్తే ఒ రక్తగ్రూపు వ్యక్తుల పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలాగే వీళ్లు శారీరకంగా ఎంతో చురుకుగా కూడా ఉంటారు. ఈ కోవకు చెందినవారు....
తినవలసినవి: అత్యధిక మాంసకృత్తులు కలిగి ఉండే ఆహారం తినాలి. ఇందుకోసం పచ్చిబఠాణీ, పాలు, జున్ను, అవకాడో, చిక్కుళ్లు, పప్పులు, విత్తనాలు తినాలి.
మాంసకృత్తులను శరీరం శోషించుకోవడం కోసం ఎక్కువగా నీళ్లు కూడా తాగుతూ ఉండాలి.
మాంసకృత్తులు, ఇతర పోషకాలను శరీరం తేలికగా, త్వరగా శోషించుకోవడం కోసం ఎక్కువగా ఇనుము ఉండే ఆహారం కూడా తింటూ ఉండాలి. ఇందుకోసం ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు తినాలి.
క్షార గుణం కలిగి ఉండే బెర్రీ పళ్లు, యాపిల్స్, మామిడిపళ్లు, అరటిపళ్లు తినాలి.
తినకూడనివి: విటమిన్ మాత్రలు, ప్రొటీన్ పౌడర్లు
పుల్లని పళ్లు
వెన్న, సోయాపాలు, మొదలైనవి తక్కువగా తినాలి. లేదంటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి.
‘ఎ’ రక్తగ్రూపు: ఈ గ్రూపు వ్యక్తులకు హృద్రోగాలు, కేన్సర్, మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువ. ఈ వ్యక్తులు సున్నితమైన శరీర తత్వం కలిగి ఉంటారు. కాబట్టి సాఽధ్యమైనంతవరకూ సహజసిద్ధ రూపంలో ఉండే ఆహార పదార్థాలనే ఎంచుకోవాలి. వీరి పొట్టలో ఆమ్ల ఉత్పత్తి తక్కువ కాబట్టి తేలికగా అరిగే పదార్థాలే తినాలి.
తినవలసినవి: పళ్ల రసాలు. ఇవి శరీరంలో నీటి శాతాన్ని స్థిరంగా ఉంచడంతోపాటు ఈ రక్తగ్రూపుకు మేలు చేస్తాయి.
సోయా, టోఫు, విత్తనాల ద్వారా సరిపడా మాంసకృత్తులు పొందవచ్చు.
కూరగాయల ద్వారా విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీఆక్సిడెంట్లు పొందాలి.
తినకూడనివి: పాల ఉత్పత్తులు జీర్ణం కావడం కష్టం కాబట్టి వీలైనంత తక్కువ తీసుకోవాలి.
బంగాళాదుంపలు, చిలకడదుంపలు, క్యాబేజీ, టమాటాలలో ఉండే పెప్టిన్ అనే ఎంజైమ్ జీర్ణం కాదు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
‘బి’ రక్తగ్రూపు: ఈ గ్రూపుకు చెందిన ఆహారం సమతులంగా ఉండి, పరిపూర్ణంగా కూడా ఉంటుంది. ఈ గ్రూపు వ్యక్తులు ఎలాంటి ఆహారాన్నైనా జీర్ణం చేసుకోగలరు. కాబట్టి ఆహారంలో ఎన్నో రకాల పదార్థాలను చేర్చుకోవచ్చు. కూరగాయలు, పళ్లు, పాల ఉత్పత్తులు....సమస్తం వీళ్లు తినవచ్చు.
‘ఎబి’ రక్తగ్రూపు: ఇది అరుదైర రక్తగ్రూపు. వీరికి ‘ఎ’, ‘బి’....ఈ రెండు రక్తగ్రూపుల లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండు గ్రూపులకు చెందిన ఆహారం తింటూ ఒంట్లో ఆమ్ల తత్వాన్ని స్థిరంగా ఉంచకోవాలి. ఇందుకోసం....
తినవలసినవి: పాల ఉత్పత్తులు వీరికెంతో మేలు చేస్తాయి. కాబట్టి పాలు, పెరుగు, వెన్న, జున్ను... తింటూ ఉండాలి.
బీన్స్, చిక్కుళ్లు, సోయా, వేరుసెనగపప్పు, పెసలు తింటూ ఉండాలి.
బీట్రూట్, బ్కొకొలి, దోస, వంకాయ ఎక్కువగా తినాలి.
శరీరంలో నీటి శాతం స్థిరంగా ఉంచడం కోసం ఎక్కువగా పళ్లరసాలు తాగుతూ ఉండాలి.
తినకూడనివి: మాంసాహారం.