Weight Loss : బరువు తగ్గడానికి 10 కొవ్వు పదార్థాలు..
ABN , Publish Date - Jun 03 , 2024 | 02:50 PM
అధిక నాణ్యత కలిగిన ఆలివ్ నూనెలో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఆలివ్ నూనెను సలాడ్స్, డీప్ ఫ్రై చేయడానికి కాకుండా లైట్ సాటింగ్ కోసం ఉపయోగించాలి.
బరువు పెరగడం ఏ కారణం చేతనైనా బరువు పెరిగి తగ్గడం అనేది పెద్ద సవాలుగా మారుతుంది. బరువు తగ్గించుకోవడం అనేది అంత సులువైన పని మాత్రం కాదు. దీనికి సరైన జీవనశైలి అలవాట్లు కూడా అంతే అవసరం. వ్యాయామం, సరైన నిద్ర, ఆహారం విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. అయితే కొవ్వు పదార్థాలను తీసుకుంటూ కూడా బరువు తగ్గచ్చనే మాట మీకు తెలుసా.. అవేటంటే.
అవకాడో..
ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్నప్పటికీ అవకాడో ఫైబర్ పుష్కలంగా, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఆకలిని తగ్గిస్తుంది. అవకాడో సలాడ్స్, టోస్ట్, స్మూతీస్‌లలో ఆరోగ్యకరమైన ఫుడ్‌గా తీసుకోవచ్చు.
కొవ్వు చేప..
సాల్మాన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతమైన పోషకం. ఇందులోని కొవ్వు ఆకలిని నియంత్రిస్తాయి. కొవ్వును కరిగించడంలో సహకరిస్తాయి.
గింజలు..
బాదం, వాల్ నట్స్, పిస్తాపప్పులు, ఇతర గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్లతో నిండి ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
ఆలివ్ నూనె..
అధిక నాణ్యత కలిగిన ఆలివ్ నూనెలో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఆలివ్ నూనెను సలాడ్స్, డీప్ ఫ్రై చేయడానికి కాకుండా లైట్ సాటింగ్ కోసం ఉపయోగించాలి.
Eat One Amla Daily : ప్రతి రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..
కొబ్బరి నూనె..
సంతృప్త కొవ్వు అధికంగా ఉన్నప్పటికీ కొబ్బరి నూనెలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. వంటలోకి, బేకింగ్ చేయడానికి కొబ్బరి నూనెను మితంగా ఉపయోగించాలి.
చియా విత్తనాలు..
చియా గింజలు ఒమేగా 3 కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లతో నిండి ఉంటాయి. తినేటప్పుడు అవి ద్రవాన్ని గ్రహిస్తాయి. కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. పెరుగు, వోట్మిల్ లలో చియా విత్తనాలు చల్లి తీసుకోవచ్చు. ఇవి స్మూతీస్ లో కూడా కలపవచ్చు.
Expensive Foods : భారతదేశంలో లభించే 5 అత్యంత ఖరీదైన ఆహారాలు..
కొవ్వు పెరుగు.. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు బరువు తగ్గడం కోసం పనిచేస్తాయి.
డార్క్ చాక్లెట్ .. ఎక్కవ కోకో కంటెంట్ కలిగిన డార్క్ చాక్లెట్ ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.
గుడ్లు..కొలెస్ట్రాల్ కంటెంట్ కారణంగా గుడ్లు అనారోగ్యకరమైనవి. గుడ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన అమైనో ఆమ్లాలుంటాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.