Expensive Foods : భారతదేశంలో లభించే 5 అత్యంత ఖరీదైన ఆహారాలు..
ABN , Publish Date - May 31 , 2024 | 04:31 PM
అల్ఫోన్సో మామిడి కాయలు.. అన్ని మామిడి పండ్లలా కాదు ఇవి. వీటికో ప్రత్యేకత ఉంది. ప్రత్యేకమైన రుచి, ఈ ప్రత్యేకమైన వాసన ఉండటం వల్ల వీటి ఖరీదు ఎక్కువ.. వీటి ఆకృతి కూడా భిన్నమైనదే.
మనం తినే ఆహారంలో ఎన్నో రకాలు, కొన్ని అతి సులభంగా లభిస్తాయి. అన్నీరుచికరంగా ఉండేవే అయితే డిమాండ్ కొద్దీ వ్యాపారం అన్నమాట, శరీరాన్ని శక్తిగా ఉంచుకోవడానికి మనం తీసుకునే ఆహారం ఎంత ఖరీదో తెలుసా.. కొన్ని పదార్థాలు ఇట్టే ఖరీదు ఉంటాయి. వాటిని కొనాలన్నా, తినాలన్నా కూడా ఆలోచించాల్సిందే అయితే అవి ఇట్టే మనకు దొరకవు కూడా అవే భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పదార్థాలు. వీటి గురించి తెలుసుకుందాం..
భారతదేశంలో లభించే 5 అత్యంత ఖరీదైన ఆహారాలు ఇవి వీటిని గురించి తెలుసుకుందాం.
A2గిర్ ఆవుపాలు..
ఈ గీర్ జాతి ఆవుల పాలు అధిక పోషకాలతో నిండి ఉంటాయి. కాశ్మీరీ మోరల్స్, బ్లూఫిన్ ట్యూనా,అల్ఫోన్సో మామిడితో సహా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహారాలలో కొన్ని.
కాశ్మీరీ మోరల్స్, పుట్టగొడలు..
అరుదైన ఈ పుట్టగొడుగులు హిమాలయ ప్రాంతంలో ఉంటాయి. వీటి ప్రత్యేకమైన రుచి. ఆరోగ్య ప్రయోజనాలు అత్యంత విలువైనవి. అందుకే వీటిని సేకరించడం కూడా కష్టం, అందుకే మంచి డిమాండ్ ఉంది.
బ్లూఫిన్ ట్యూనా..
బ్లూఫిన్ ట్యూనా అత్యంత విలువైన చేప. ఇది గొప్ప రుచి, లేత ఆకృతికి పేరుపొందాయి. దొరకడం కాస్త కష్టమే అయినా.. దీనిని తింటే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలంట.
ఎండ వేడిని తట్టుకునే విధంగా శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..
అల్ఫోన్సో మామిడి కాయలు..
అన్ని మామిడి పండ్లలా కాదు ఇవి. వీటికో ప్రత్యేకత ఉంది. ప్రత్యేకమైన రుచి, ఈ ప్రత్యేకమైన వాసవ ఉండటం వల్ల ఇవి అంత ఖరీదు.. వీటి ఆకృతి కూడా భిన్నమైనదే.
కేసర్ కుంకుమ పువ్వు..
కుంకుమ పువ్వు అత్యంత గొప్ప సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దీనితో రుచి, రంగు వాసన కలిగి ఉంటుంది. దీనిని కొనజంకూడా చాలా ఖరీదైన పనే. అయితే వీటిని తింటూ ఉంటే గ్లామర్ పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది.
ఈ ఆహారాలు వాటి ప్రత్యేకమైన రుచులతో, పోషకాలతో వాటి ప్రయోజనాలతో కూడి ఉన్నాయి. వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.